బాక్స్ ఆఫీస్ దగ్గర ఇలాంటి మైండ్ బ్లాంక్ చేసే ఎఫెక్ట్ రీసెంట్ టైం లో ఏ సినిమా విషయంలో కూడా కాలేదనే చెప్పాలి. రీసెంట్ టైం లో మంచి క్రేజీ కాంబినేషన్స్ లో ఒకటిగా నిలిచిన మెగాస్టార్ చిరంజీవి మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబినేషన్ ఒకటి అని చెప్పాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయం అంటే తెలియని డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్ లో ఇద్దరు హీరోలు కలిసి….
చేసిన లేటెస్ట్ మూవీ ఆచార్య సినిమా రిలీజ్ ఆలస్యం అవ్వడంతో బజ్ తగ్గింది కానీ రిలీజ్ అయ్యాక జోరు చూపించే అవకాశం ఉంటుంది అని అందరూ అనుకున్నారు కానీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర నెగటివ్ టాక్ ని సొంతం చేసుకున్న ఆచార్య సినిమా ఓపెనింగ్స్ లోనే….
నిరాశ పరిచింది. ఇక రెండో రోజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీగా స్లో డౌన్ అవ్వగా రెండు తెలుగు రాష్ట్రాలలో చాలా సెంటర్స్ లో జనాలు లేక షోలు కాన్సిల్ అయ్యాయి. ఇక కర్ణాటకలో సినిమా కి ఇచ్చిన షోలలో లో ఆక్యుపెన్సీ వలన షో లను కాన్సిల్ చేసి ఆ షోలను…
కేజిఎఫ్ 2 సినిమాకి ఇచ్చేశారు… ఇలాంటి పరిస్థితి ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటించిన సినిమాకి దక్కడం విచారకరం అనే చెప్పాలి. రెండో రోజు షోలు కాన్సిల్ అవ్వడం, చాలా సెంటర్స్ లో హైర్స్ కట్టిన థియేటర్స్ లో డెఫిసిట్ లు పడటం ఆచార్య సినిమా కి జరిగింది ఇప్పుడు…. ఇంత క్రేజీ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా ఇలాంటి ట్రెండ్ ని….
బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంటుంది అని ఎవ్వరూ ఊహించలేదు అనే చెప్పాలి. ఇక సినిమా అందుకోవాల్సిన టార్గెట్ చాలా పెద్దది అవ్వడంతో రెండో రోజు డ్రాప్ అయిన తీరు చూస్తుంటే సినిమా తేరుకునే అవకాశం లేనట్లే కనిపిస్తుంది…. ఇక వీకెండ్ లోనే ఇలా ఉంటే వర్కింగ్ డేస్ లో సినిమా బాక్స్ ఆఫీస్ పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి ఇక….