పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ ఆదిపురుష్ (Adipurush) రెండు వారాలను పూర్తి చేసుకుని మూడో వారంలో అడుగు పెట్టింది. తెలుగు రాష్ట్రాల్లో సినిమా చాలా లిమిటెడ్ థియేటర్స్ లో పరుగును కొనసాగిస్తూ ఉండగా…
ఇతర రాష్ట్రాల్లో సినిమా పరుగు ఆల్ మోస్ట్ ఇప్పుడు కంప్లీట్ చేసుకుంటూ వెళుతుంది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు కేరళలో పరుగును పూర్తీ చేసుకుంది మిగిలిన చోట్లతో పోల్చితే… అన్ని చోట్లా ఎంతో కొంత గ్రాస్ వసూల్ అవుతూ ఉన్నప్పటికీ…
కేరళలో సినిమా పరుగు ఇప్పుడు కంప్లీట్ అయింది. సినిమా కేరళలో మొత్తం మీద 2 కోట్ల రేంజ్ లో వాల్యూ బిజినెస్ ను సొంతం చేసుకుంది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఓపెనింగ్ డే నుండే అంచనాలను అందుకోలేక పోయిన సినిమా….
టోటల్ రన్ లో ఇప్పుడు సినిమా కేరళలో 2.10 కోట్ల రేంజ్ లో గ్రాస్ వసూళ్ళని అందుకుని పరుగును పూర్తీ చేసుకుంది. సినిమా కేరళలో మొత్తం మీద 87 లక్షల రేంజ్ లో షేర్ ని మాత్రమే అందుకుని రన్ ని కంప్లీట్ చేసుకోగా ఓవరాల్ గా బిజినెస్ నుండి…
1.13 కోట్ల రేంజ్ లో లాస్ ను సొంతం చేసుకుని డిసాస్టర్ రిజల్ట్ ను కేరళలో సొంతం చేసుకుంది. ప్రభాస్ నటించిన బాహుబలి2(Baahubali2) తర్వాత చేసిన సినిమాలు అన్నీ కూడా కేరళలో కలెక్షన్స్ పరంగా తీవ్రంగా నిరాశ పరచడం విచారకం అని చెప్పాలి.