Home న్యూస్ ఆదిపురుష్ @ 50 కోట్లు….12 కోట్ల లాస్ తర్వాత ఇది రికార్డే!!

ఆదిపురుష్ @ 50 కోట్లు….12 కోట్ల లాస్ తర్వాత ఇది రికార్డే!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ ఇయర్ పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన రాధే శ్యామ్ సినిమా భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యి అంచనాలను అందుకోవడంలో తీవ్రంగా విఫలం అయ్యింది. సినిమా అన్ని చోట్లా భారీగానే నష్టాలను సొంతం చేసుకుంది. 

అలాంటి డిసాస్టర్ మూవీ తర్వాత ప్రభాస్ ఇప్పుడు ఆది పురుష్(Adi Purush) సినిమాతో సంచలనం సృష్టించడానికి సిద్ధం అవుతూ ఉండగా ఈ సినిమా కూడా టీసర్ రిలీజ్ టైంలో భారీ ట్రోల్స్ ని ఫేస్ చేసినా కానీ తర్వాత లెక్కలు అన్నీ మారిపోయి భారీ హైప్ ను సొంతం చేసుకుంది.

ఇక బిజినెస్ పరంగా కూడా కుమ్మేసిన సినిమా అన్ని ఏరియాలలో బిజినెస్ ల పరంగా కుమ్మేసింది. నైజాంలో ఈ సినిమా ఇప్పుడు 50 కోట్ల బిజినెస్ ను దక్కించుకుని భీభత్సం సృష్టించింది. అసలు లెక్క 60 కోట్లు కాగా అందులో 10 కోట్లు ఒకవేళ సినిమా టార్గెట్ ను అందుకోక పొతే…

రిటర్న్ ఇవ్వాల్సి ఉంటుంది అన్న ఒప్పందంతో జరిగింది… సినిమా ఇప్పుడు నైజాంలో డిస్ట్రిబ్యూటర్లు లాభాలను అందుకోవాలి అంటే 50 కోట్లకు పైగా షేర్ ని, మేకర్స్ కూడా లాభాలు అందుకోవాలి అంటే 60 కోట్ల షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ విశేషం ఏంటి అంటే…

లాస్ట్ ఇయర్ వచ్చిన రాధే శ్యామ్(Radhe Shyam) మూవీ 36.5 కోట్ల బిజినెస్ కి 24.8 కోట్ల షేర్ ని అందుకుని ఆల్ మోస్ట్ 12 కోట్ల లోపు లాస్ ను అందుకోగా ఇప్పుడు అలాంటి లాస్ మూవీ తర్వాత ట్రోల్స్ ని ఫేస్ చేసిన సినిమాతో ఈ రేంజ్ లో బిజినెస్ ని అందుకుని ఊచకోత కోయడం విశేషం. ఇక ఆదిపురుష్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ లో రచ్చ చేస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here