AdiPurush Review: వరల్డ్ వైడ్ గా 7000 కి పైగా థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ ను సొంతం చేసుకున్న పాన్ ఇండియా బిగ్ మూవీ ఆది పురుష్(Adi Purush) సినిమా టీసర్ రిలీజ్ టైంలో అనేక ట్రోల్స్ ని ఫేస్ చేసిన తర్వాత ట్రైలర్ లు, సాంగ్స్ తో అద్బుతమైన బజ్ ను సొంతం చేసుకుని ఇప్పుడు… ఆడియన్స్ లో అద్బుతమైన అంచనాలతో భారీ ఎత్తున రిలీజ్ అవ్వగా సినిమా ఎలా ఉంది, ఎంతవరకు ఆడియన్స్ అంచనాలను అందుకుంది అన్నది ఆసక్తిగా మారింది..
మరి సినిమా ఎంతవరకు మెప్పించిందో తెలుసుకుందాం పదండీ… ముందుగా కథ పాయింట్ కి వస్తే మనం చిన్నప్పటి నుండి చూసిన విన్న రామాయణాన్ని మాడ్రన్ ఆడియన్స్ కి తన పాయింట్ ఆఫ్ వ్యూ నుండి చెప్పాడు డైరెక్టర్ ఓం రౌత్, కానీ చెప్పిన విధానం ఎంతవరకు మెప్పించిందో తెలుసుకుందాం పదండీ…
ముందుగా రాముడిగా ప్రభాస్(Prabhas) చాలా సీన్స్ లో అద్బుతంగా సెట్ అయ్యాడు, కొన్ని చోట్ల లుక్స్ ఎందుకో కొంచం డిఫెరెంట్ గా అనిపించగా ప్రభాస్ తన స్క్రీన్ ప్రజెన్స్ తో ఆకట్టుకున్నాడు. ఇక సీతగా కృతి సనన్ రోల్ చిన్నదే అయినా ఉన్నంత వరకు బాగా మెప్పించింది. ఇక రావణాసురుడిగా సైఫ్ అలీ ఖాన్ పర్వాలేదు కానీ…
తన లుక్స్ కానీ తన లంక సెట్ అప్ కానీ, తన సైన్యం కానీ చిన్నప్పటి నుండి మనం చూసిన రామాయణంతో కంపేర్ చేస్తే ఏమంత బాగా అనిపించదు. అలాగే చాలా చోట్ల గ్రాఫిక్స్ కూడా నిరాశ పరిచే విధంగా ఉంటుంది…. మిగిలిన యాక్టర్స్ లో లకష్మణుడి రోల్ చేసిన సన్నీ సింగ్ పర్వాలేదు. ఇక హనుమాన్ రోల్ మాత్రం చాలా బాగా మెప్పిస్తుంది అని చెప్పాలి…
సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అంటే మాత్రం సంగీతం అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ అని చెప్పాలి. పాటలు వినడానికి ఎంత బాగున్నాయో చూడటానికి కూడా అంతే బాగున్నాయి. ఇక బ్యాగ్రౌండ్ స్కోర్ కొన్ని చోట్ల ఎక్స్ లెంట్ గా ఉండటం విశేషం. ఇక ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే చాలా నెమ్మదిగా సాగుతుంది… గ్రాఫిక్స్ వర్క్ టీసర్ రిలీజ్ తర్వాత ఎలాంటి ట్రోల్స్ ని ఫేస్ చేసిందో…
సినిమాలో కొన్ని చోట్ల మళ్ళీ అలానే అనిపిస్తుంది…సెకెండ్ ఆఫ్ లో వార్ సీన్స్ లో గ్రీన్ స్క్రీన్ ఎఫెక్ట్స్ క్లియర్ గా కనిపించడం విచారకరం…. ప్రొడక్షన్ వాల్యూస్ మరీ అనుకున్న రేంజ్ లో లేవు. ఇక డైరెక్షన్ విషయానికి వస్తే ఓం రౌత్ మనకు తెలిసిన రామాయణ కథని అసలు తెలియని ప్రజెంట్ కిడ్స్ అండ్ యంగ్ ఆడియన్స్ కోసం తన స్టైల్ లో చెప్పే ప్రయత్నం చేశాడు….
ఫస్టాఫ్ వరకు బాగానే మ్యానేజ్ చేశాడు, దాంతో సినిమా బాగుంది అనిపించేలా మెప్పించినా సెకెండ్ ఆఫ్ లో మాత్రం ట్రాక్ తప్పేశాడు…. ఎమోషన్స్ పండలేదు, కొన్ని చోట్ల డబ్బింగ్ కూడా సెట్ అవ్వలేదు, రావనాసుడిగా సైఫ్ అలీ ఖాన్ రోల్ ఓవర్ ది టాప్ వెళుతుంది. ఇలా సెకెండ్ ఆఫ్ లో కథ నీరసంగా ఎమోషన్ లెస్ గా సాగుతుంది… అయినా కూడా…
ఎక్కడా రామాయణాన్ని చెడగొట్టలేదు అని చెప్పాలి… ఇంత మాడ్రన్ గా చెప్పకుండా చాలా వరకు మనుషులతోనే కథని చెప్పి గ్రాండియర్ నెస్ ను పెంచి అబ్బుర పరిచే గ్రాఫిక్స్ తో కథని చెప్పి ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది…. కానీ సినిమా కథ చాలా వరకు తెలిసిందే అయినా కూడా….
ఒకసారి చూడొచ్చు అనిపించేలా ఆదిపురుష్ సినిమా ఉందని చెప్పొచ్చు…. ఓం రౌత్ సినిమా పోస్ట్ పోన్ టైంలో ట్రైలర్ అండ్ సాంగ్స్ తో హైప్ ను పెంచాడు కానీ తన ఫ్లాస్ ను పూర్తిగా సరిదిద్దుకోలేక పోయాడు… దాంతో భారీ హైప్ తో థియేటర్స్ కి వెళ్ళే ఆడియన్స్ కి సినిమా కొంచం నిరాశగా అనిపించవచ్చు. టీసర్ ను గుర్తు చేసుకుని లో అంచనాలతో థియేటర్స్ కి వెళ్ళే ఆడియన్స్ కి…
కొన్ని ఫ్లాస్ ఉన్నప్పటికీ కూడా మన రామాయణాన్ని మరోసారి వెండి తెరపై ఉన్నంతలో ఇంత గ్రాండ్ గా కొత్తగా చూడటం అన్నది బాగుంది…. మినిమమ్ అంచనాలతో థియేటర్స్ కి వెళితే సినిమా ఈజీగా ఒకసారి చూడొచ్చు అనిపిస్తుంది…. భారీ అంచనాలతో వెళితే కొన్ని చోట్ల గ్రాఫిక్స్ నిరాశ పరిచినా పర్వాలేదు అనిపిస్తుంది ఆదిపురుష్…. రామాయణ కథకి మనం రేటింగ్ ఇవ్వలేం కనుక ఒక్కసారి అయినా చూసేలా అయితే ఆదిపురుష్ ఉందని చెబుతున్నాం.
Nv epudu anna sariga review estav … Mega family aethe bagundhi super undhi antav asalu t2b ni fallow avatam west ani epudu ardham aendhi…