బొద్దుగా ఉండే కృష్ణుడు కోసమే తయారు చేసినట్లు ఉండే సినిమా వినాయకుడు… బాక్స్ ఆఫీస్ దగ్గర చిన్న సినిమా గా రిలీజ్ అయిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా అవార్డుల విషయం లో కూడా దుమ్ము లేపింది. 12 ఏళ్ల క్రితం బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా ఆల్ మోస్ట్ 2.5 కోట్ల రేంజ్ లో షేర్ ని వసూల్ చేసి సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది.
దాంతో ఆ టైం లో నే ఈ సినిమా పై ఇతర ఇండస్ట్రీ లలో మంచి క్రేజ్ ఏర్పడినా కానీ ఎందుకనో ఎవ్వరూ రీమేక్ చేయలేదు, దాంతో అలాగే ఉండి పోయిన ఈ సినిమా ఇప్పుడు ఆల్ మోస్ట్ 12 ఏళ్ల తర్వాత రీమేక్ కి సిద్ధం అయింది.
త్వరలోనే ఈ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఓ పెద్ద ప్రొడక్షన్ హౌస్ తో ఈ సినిమా ను రీమేక్ చేయడానికి ఓకే చెప్పాడు ఈ సినిమా డైరెక్టర్ సాయి కిరణ్ అడివి. అడవి శేష్ అన్నయ అయిన ఈయన ఈ సినిమా తో మంచి గుర్తింపు తెచ్చుకున్నా..
తర్వాత పెద్దగా సినిమాలు చేసినా మెప్పించలేదు. కృష్ణుడు కూడా ఈ సినిమా తర్వాత పలు సినిమాలు చేసినా ఆశించిన విజయాలను అందుకోలేదు, మళ్ళీ ఈ సినిమా సీక్వెల్ గా విలేజ్ లో వినాయకుడు చేసినా అది కూడా జస్ట్ ఓకే అనిపించుకుంది కానీ మొదటి పార్ట్ లా ఆడియన్స్ మెప్పును అయితే పొందలేదు. ఇప్పుడు ఫస్ట్ పార్ట్ ని…
సాయి కిరణ్ అడివి హిందీ లో తానె స్వయంగా డైరెక్ట్ చేయబోతున్నాడు… అక్కడ కాస్ట్ అండ్ క్రూ వివరాలు ఇంకా ఏవి రిలీజ్ చేయలేదు కానీ తెలుగు లో వచ్చిన రేంజ్ లో హిందీ లో అవుట్ పుట్ వస్తే అక్కడ మల్టీ ప్లెక్స్ ఆడియన్స్ సందడితో సినిమా సూపర్ డూపర్ విజయాన్ని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి…