బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమాల రిజల్ట్ ఎలా ఉంటాయో అన్నది రిలీజ్ అయ్యాకే తెలుస్తుంది, కానీ కొన్ని సినిమాలు మాత్రం ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉంటాయి తమ ప్రాజెక్ట్. ఇంకా కొందరు అయితే ఈ సినిమా కచ్చితంగా అంచనాలను మించుతుందని, కథ ఎక్కువగా చెప్పడానికి వీలు ఉందని ఏకంగా రెండు పార్టులుగా ఆడియన్స్ ముందుకు వస్తూ ఉంటారు. ఇలా ఇప్పటి వరకు టాలీవుడ్ నుండి బాహుబలి సినిమా అలాగే కన్నడ లో…
KGF సినిమా మొదటి పార్ట్ తర్వాత రెండో పార్ట్ కంటిన్యూ చేసి సినిమాను ముగించారు. ఇక ఈ సినిమాల తర్వాత ఇప్పుడు కొత్తగా పుష్ప సినిమా కూడా బాక్స్ అఫీస్ దగ్గర రెండు పార్టులుగా రాబోతుంది అంటూ రీసెంట్ గా వార్తలు ప్రచారం లోకి రాగా ఈ విషయాన్ని ఇప్పుడు…
సినిమా నిర్మాతనే ఒక వెబ్ ఇంటర్వ్యూ లో అఫీషియల్ గా కన్ఫాం చేశారు. దాంతో పుష్ప సినిమా కూడా రెండు భాగాలుగా ఆడియన్స్ ముందుకు రాబోతుంది అని కన్ఫాం అవ్వగా మొదటి పార్ట్ ఈ ఇయర్ అక్టోబర్ టైం లో, సెకెండ్ పార్ట్ వచ్చే ఇయర్ సెకెండ్ ఆఫ్ టైం లో…
ఆడియన్స్ ముందుకు వస్తాయని తెలుస్తుంది. ఇక ఈ సినిమా రెండు పార్టులుగా మారడం తో బడ్జెట్ ను రీవైజ్ చేసి ఇప్పుడు టోటల్ బడ్జెట్ 250 కోట్లు అనుకుంటున్నారట. అందులో ఫస్ట్ పార్ట్ కోసం ఇప్పటికే 110 కోట్లు ఖర్చు చేశారని టాక్ ఉండగా మొదటి భాగం మొత్తం మీద 140 కోట్ల లోపు బడ్జెట్ తో పూర్తీ అవుతుందని రెండో పార్ట్ కి 110 కోట్ల బడ్జెట్ ని…
కేటాయించబోతున్నారని తెలుస్తుంది. ఇక సినిమాలో ఫస్ట్ పార్ట్ ఎండ్ టైం కి వచ్చే ట్విస్ట్ ఒకటి కూడా ఇప్పుడు చక్కర్లు కొడుతుంది, ఆ న్యూస్ ప్రకారం ఫస్ట్ పార్ట్ విలన్ వేరే ఉన్నారని, ఆ విలన్ ని హీరో అంతమొందించి ముగించే టైం లో ఫహాద్ ఫాజిల్ ఎంటర్ అవుతాడని, ఇక తర్వాత ఏమవుతుంది అన్నది సెకెండ్ పార్ట్ లో ఉంటుందని అంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది.