Home న్యూస్ అల్టిమేట్ కాంబినేషన్ ని కన్ఫాం చేసిన ఎన్టీఆర్…ఎన్టీఆర్ అప్ కమింగ్ మూవీస్ డైరెక్టర్స్ వీళ్ళే!!

అల్టిమేట్ కాంబినేషన్ ని కన్ఫాం చేసిన ఎన్టీఆర్…ఎన్టీఆర్ అప్ కమింగ్ మూవీస్ డైరెక్టర్స్ వీళ్ళే!!

0

 టెంపర్ కి ముందు వరకు వరుస ఫ్లాఫ్స్ ను ఎదురుకున్నా టెంపర్ తర్వాత ఒక్కటంటే ఒక్క అపజయం లేకుండా కెరీర్ లో దూసుకు పోతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవ కుశ మరియు అరవింద సమేత సినిమాలతో దుమ్ము లేపాడు. అరవింద సమేత తర్వాత పూర్తీ టైం ని కూడా ఆర్ ఆర్ ఆర్ కోసమే కేటాయించిన ఎన్టీఆర్ ఇప్పుడు కరోనా ఇబ్బందుల వలన…

India's Biggest Birthday Trend Record Belongs To #HappyBirthdayNTR

ఇంకా షూటింగ్ ను కంప్లీట్ చేయాల్సి ఉండగా ఆ ఇంపాక్ట్ ఎన్టీఆర్ అప్ కమింగ్ మూవీస్ పై కూడా పడింది. దాంతో ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ సినిమా అనుకున్నా అది లాస్ట్ మినట్ లో కాన్సిల్ అయ్యి ఇప్పుడు కొరటాల శివ తో సినిమా కన్ఫాం అయ్యింది. ఇక రీసెంట్ గా ఎన్టీఆర్…

ఓ హాలీవుడ్ వెబ్ సైట్ కి వెబ్ ఇంటర్వ్యూ ఇవ్వగా అందులో అప్ కమింగ్ మూవీస్ గురించి మాట్లాడాడు. ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ చేస్తున్నానని, తర్వాత కొరటాల శివ తో మూవీ ఉంటుందని, ఆ తర్వాత సినిమా KGF డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో ఉంటుంది అని కన్ఫాం చేశాడు.

దాంతో ప్రశాంత్ నీల్ తో మూవీ కాన్సిల్ అయ్యిందేమో అన్న రూమర్స్ కి ఓపెన్ గా చెక్ పెట్టాడు ఎన్టీఆర్. ఇక ఆర్ ఆర్ ఆర్ మాదిరిగానే కొరటాల శివ తో చేస్తున్న సినిమా కూడా ఇండియా లో అన్ని మేజర్ భాషల్లో రిలీజ్ అవుతుందని కన్ఫాం చేశాడు. ప్రశాంత్ నీల్ తో మూవీ కూడా ఎలాగు పాన్ ఇండియా మూవీ కాబట్టి ఎన్టీఆర్…

RRR తర్వాత చేయబోయే సినిమాలు పాన్ ఇండియా మూవీస్ అని కన్ఫాం అయ్యిపోయింది. ఇక ఆర్ ఆర్ ఆర్ లో యాక్షన్ సీన్స్ ఊహకందని లెవల్ లో ఉంటాయని, ప్రతీ యాక్షన్ సీన్ కి ఆడియన్స్ వావ్ అంటూ ఎక్సైట్ అవ్వడం ఖాయమని చెప్పుకొచ్చాడు ఎన్టీఆర్.. మొత్తం మీద స్వయంగా ఎన్టీఆర్ తన అప్ కమింగ్ మూవీస్ రివీల్ చేయడం తో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ లో ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here