కరెక్ట్ టైం కి స్పందించక పొతే పరిస్థితులు పూర్తిగా తారుమారు అవుతాయి, రీసెంట్ టైం లో డైరెక్ట్ రిలీజ్ ని సొంతం చేసుకున్న సినిమాల్లో ఎక్కువ శాతం సినిమాలు కరెక్ట్ టైం కి సినిమా ను అమ్మక పోవడం తో నష్టపోయారు తప్పితే తక్కువే మందే లాభ పడ్డారు, ఈ విషయంలో ఎక్కువగా ఇబ్బంది పడింది మాత్రం చిన్న సినిమాలు అనే చెప్పాలి, కరెక్ట్ టైం కి వచ్చిన ఆఫర్స్ ని ఓకే చేసి ఉంటె…
సినిమా ద్వారా మంచి లాభాలు వచ్చి ఉండేవి కానీ అలా చేయకపోవడం తో ఇప్పుడు థియేటర్స్ వైపా లేక డిజిటల్ రిలీజా అన్న డౌట్ లో ఉన్న సినిమాలలో యాంకర్ ప్రదీప్ హీరోగా లాంచ్ అవుతున్న 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా కూడా ఒకటి…
సమ్మర్ టైం లో సినిమా డైరెక్ట్ రిలీజ్ కి 6.5 కోట్లకి తగ్గని ఆఫర్లు రాగా నో చెప్పి తర్వాత ఆఫర్స్ కోసం ఎదురు చూస్తున్న టైం లో రేట్లు మరింతగా తగ్గుతూ రాగా రీసెంట్ గా సినిమాకి 2.5 కోట్ల రేంజ్ రేటు ఆఫర్ లు ఇస్తున్నాయి పేరున్న OTT యాప్స్ అన్నీ…
దాంతో సినిమా పరిస్థితి ఏమవుతుందో అని ఎదురు చూస్తున్న టైం లో ఈ ఆఫర్ కన్నా కొంచం బెటర్ ఆఫర్ ను ఆహా యాప్ వాళ్ళు ఈ సినిమా కి ఇచ్చారట… ఇతర చిన్న సినిమాలను కొన్న విధంగానే ఈ సినిమా ను కూడా 3 కోట్ల రేంజ్ లో కొనడానికి మేం సిద్ధం అంటూ తమ ఆఫర్ ని చెప్పుకోచ్చారట…
కానీ సినిమా బడ్జెట్ 4.5 కోట్ల రేంజ్ లో ఉండటం తో ఈ రేటు కూడా సరిపోదని ఎదురు చూస్తున్నారట. థియేటర్స్ రీ ఓపెన్ అయినా జనాలు థియేటర్స్ కి వచ్చినా ఈ రేటు అంత కలెక్షన్స్ కూడా రావడం కష్టమే కాబట్టి కొంచం అటూ ఇటూగా రేటు పెంచితే సినిమాను డిజిటల్ రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నారట ఇప్పుడు.