అఖండ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు సంచలన కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపింది. సినిమా ఆంధ్రలో సెకెండ్ లో షోలు కొన్ని చోట్ల కాన్సిల్ అవ్వగా ఆ ఇంపాక్ట్ కూడా కలెక్షన్స్ పై పడ్డాయి. అయినా కానీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు తెలుగు రాష్ట్రాలలో కర్ణాటకలో, తమిళనాడులో కలెక్షన్స్ ని సాలిడ్ గా సొంతం చేసుకుంది. ఇక ఓవర్సీస్ లో అమెకాలో ఆల్ మోస్ట్ 335K…
మార్క్ ని అందుకోగా ఆస్ట్రేలియాలో ఆల్ మోస్ట్ 90 వేల డాలర్స్ ని అందుకుంది. ఇక కర్ణాటకలో సాలిడ్ ఓపెనింగ్స్ ని అందుకున్న సినిమా అక్కడ నుండి 1.5 కోట్ల నుండి 2 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూల్ చేసిన అవకాశం ఎంతైనా ఉంది… ఇక సినిమా…
ఓవర్సీస్ లో 3 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోవడం ఆల్ మోస్ట్ కన్ఫాం అవ్వగా ఫైనల్ లెక్క ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది, ఇక తెలుగు రాష్ట్రాలలో సినిమా అల్టిమేట్ ఓపెనింగ్స్ ను అందుకోబోతుంది, నైజాంలో ఆల్ మోస్ట్ 7 కోట్ల నుండి 7.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా….
ఇక టోటల్ ఆంధ్ర లో సినిమా అద్బుతమైన ఆరంభాన్ని సొంతం చేసుకోగా ఓవరాల్ గా మొదటి రోజు సినిమా అక్కడ 9 నుండి 10 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఓవరాల్ గా సినిమా ఇప్పుడు వరల్డ్ వైడ్ గా మొదటి రోజు 19-20 కోట్ల రేంజ్ గ్రాస్ ను అందుకునే అవకాశం ఎంతైనా ఉంది.
టికెట్ హైక్స్ లేవు, బెనిఫిట్ షోలు, స్పెషల్ షోలు లేవు, కొన్ని చోట్ల బెనిఫిట్ షోల వలన సెకెండ్ షోలు ఎఫెక్ట్ లాంటివి ఓవరాల్ గా ఎఫెక్ట్ చూపినా కానీ ఈ రేంజ్ ఓపెనింగ్స్ ని అఫీషియల్ గా సొంతం చేసుకుంటే మాస్ భీభత్సం అనే చెప్పాలి. 3 బాక్ టు బాక్ డిసాస్టర్ల తర్వాత ఈ రేంజ్ లో బాలయ్య దుమ్ము లేపడం నిజంగానే మాస్ అని చెప్పొచ్చు.