Home న్యూస్ 1st Day అఖండ కలెక్షన్స్…బాక్స్ ఆఫీస్ ఊచకోత!

1st Day అఖండ కలెక్షన్స్…బాక్స్ ఆఫీస్ ఊచకోత!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ అఖండ మొదటి రోజు సంచలన కలెక్షన్స్ తో సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాలలో స్ట్రాంగ్ గా ఓపెన్ అవ్వగా రాయలసీమ ఏరియాలో అద్బుతమైన ఆక్యుపెన్సీ తో దుమ్ము లేపిన ఈ సినిమా గుంటూరు ఏరియాలో మొదటి రోజు 105 షోలకు పైగా హౌస్ ఫుల్ బోర్డులు పడ్డాయి, నెల్లూరు, కోస్త ఆంధ్ర ఇలా…

ఆంధ్ర ప్రదేశ్ మొత్తం సినిమా అద్బుతమైన ఆక్యుపెన్సీని మొదటి రోజు సొంతం చేసుకుంది, టికెట్ రేట్లు నార్మల్ గా ఉండటం కూడా ఇలాంటి ఆక్యుపెన్సీ కి కారణం అవ్వగా సినిమా నైజాం ఏరియాలో కూడా దుమ్ము లేపింది. హైదరాబాదులో అల్టిమేట్ బుకింగ్స్ తో ఆల్ మోస్ట్…

80% ఆక్యుపెన్సీతో దుమ్ము లేపగా సినిమా కి ఆంధ్రలో పడినట్లు హౌస్ ఫుల్స్ నైజాంలో పడకపోయినా ఓవరాల్ ఆక్యుపెన్సీ బాగుండంతో తొలిరోజు ఇక్కడ 3.5 కోట్ల నుండి 4 కోట్ల రేంజ్ ఓపెనింగ్స్ ని అందుకునేలా ఉంది, అంతకన్నా ఎక్కువ వచ్చే ఛాన్స్ కూడా పుష్కలంగా ఉందని చెప్పాలి. ఇక టోటల్ ఆంధ్రలో సినిమా 6 కోట్ల నుండి..6.5 కోట్ల రేంజ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉండగా…

టోటల్ గా అన్నీ అనుకున్నట్లు జరిగితే 10 నుండి 10.5 కోట్ల రేంజ్ కలెక్షన్స్ ని అందుకోవచ్చు, కానీ సినిమా కి ఆంధ్రలో నైట్ షోలు కొన్ని చోట్ల కాన్సిల్ అవ్వడం లాంటివి కొంచం ఇబ్బంది పెట్టె అంశమే అని చెప్పాలి. అయినా కానీ మిగిలిన చోట్ల ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ బాగున్నాయి కానీ ఆ రిపోర్ట్స్ అన్నీ అనుకున్నట్లు ఉంటే మొత్తం మీద 11 కోట్లకు పైగా కలెక్షన్స్ ని…

సినిమా సొంతం చేసుసుకునే అవకాశం ఉంది. ఇక ప్రీమియర్ షోలతో 331K మార్క్ తో సంచలనం సృష్టించిన అఖండ ఓవర్సీస్ లో కుమ్మేసింది, కర్ణాటక – తమిళనాడులో అద్బుతమైన ఆరంభాన్ని సొంతం చేసుకుంది, ఫస్ట్ డే బాలయ్య కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనర్ గా ఈ సినిమా నిలిచే అవకాశం బాక్స్ ఆఫీస్ ఊచకోత కోసిందని చెప్పొచ్చు. ఇక అఫీషియల్ రిపోర్ట్స్ ఎలా ఉంటాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here