కొత్త సినిమాలు వస్తున్న కొద్దీ పాత సినిమాల పరుగు ముగింపు దశకు చేరుకుంటుంది కానీ రీసెంట్ టైం లో ఈ రేంజ్ లో లాంగ్ రన్ ని అది కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో కూడా సొంతం చేసుకుంటూ దూసుకు పోతున్న సినిమాగా నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ అఖండ నిలుస్తుంది. సినిమా రిలీజ్ అయ్యి నెల అయిపోయినా న్యూ ఇయర్ వీకెండ్ ఇప్పుడు సినిమా కి…
కలిసి రావడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర మళ్ళీ బ్యాటింగ్ మొదలు పెట్టగా 31 వ రోజు ఏకంగా 60 లక్షల షేర్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు 32 వ రోజు కూడా ఆదివారం అడ్వాంటేజ్ తో చాలా ఏరియాల్లో హౌస్ ఫుల్ బోర్డులతో కళకళలాడుతూ దుమ్ము లేపుతుంది.
సినిమా ఈ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు తెలుగు రాష్ట్రాలలో మినిమమ్ 40 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునేలా ఉండగా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే లెక్క 45-50 లక్షల దాకా వెళ్ళే అవకాశం ఉందని అంటున్నారు. 32 వ రోజు ఇలాంటి కలెక్షన్స్ అంటే మామూలు మాస్ కాదనే చెప్పాలి.