బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన 7 వ వారంలో కూడా షేర్స్ ని సొంతం చేసుకోవడం అన్నది చాలా రేర్ గా జరుగుతూ ఉంటుంది, ఇప్పుడు అలాంటి రేర్ ఫీట్ నే సొంతం చేసుకుని కలెక్షన్స్ పరంగా దూసుకు పోతుంది నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ అఖండ… రిలీజ్ అయిన 7 వ వారంలో సూపర్ సాలిడ్ కలెక్షన్స్ తో డెఫిసిట్ లు లేకుండా పరుగును కొనసాగాగించడం ఒకెత్తు అయితే….
సినిమా ఆల్ మోస్ట్ అఖండ తర్వాత వచ్చిన సినిమాలతో పోల్చితే బెటర్ షేర్స్ ని ఇప్పటికీ సాధిస్తూ ఉండటం మరో రేర్ ఫీట్ అని చెప్పాలి. ఇక రీసెంట్ గా సంక్రాంతి హాలిడే రోజున కానీ తర్వాత కనుమ హాలిడే రోజున కానీ సినిమా మిగిలిన ఏరియాలలో ఎలా ఉన్నప్పటికీ కూడా..
హైదరాబాదులో RTC X రోడ్స్ లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ ఉండగా రోజు మొత్తం కొత్త సినిమాలతో పాటు ఏకంగా బంగార్రాజు ని కూడా ఇక్కడ డామినేట్ చేసేలా కలెక్షన్స్ ని అఖండ సొంతం చేసుకుంది. బంగార్రాజు సినిమా రోజు మొత్తం మీద కూడా…
ఆల్ మోస్ట్ 1,95,930 కలెక్షన్స్ ని ఇక్కడ సొంతం చేసుకుంటే అఖండ సినిమా మాత్రం ఏకంగా 2,04,160 కలెక్షన్స్ ని ఇక్కడ కనుమ హాలిడే రోజు సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది…. రిలీజ్ అయిన 46 వ రోజు అఖండ కొత్త సినిమా అయిన బంగార్రాజు తో పోటి పడీ ఈ రేంజ్ లో వసూళ్ళని ఇక్కడ సొంతం చేసుకోవడం విశేషం… హైదరాబాదులో RTC X రోడ్స్….
కాకుండా మిగిలిన అన్ని చోట్లా నైజాంలో బంగార్రాజు హవా బాగానే ఉన్నప్పటికీ లిమిటెడ్ గానే థియేటర్స్ ని హోల్డ్ చేసిన అఖండ ఈ రేంజ్ లో కలెక్షన్స్ ని 46 వ రోజు సొంతం చేసుకోవడం విశేషం అనే చెప్పాలి. రీసెంట్ టైం లో ఈ రేంజ్ లో లాంగ్ రన్ ఒక్క అఖండ సినిమా కే సొంతం అయ్యింది అని చెప్పొచ్చు…