బాక్స్ ఆఫీస్ దగ్గర వరుస పరజాయల తర్వాత మార్కెట్ డౌన్ అయిన టైం లో నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమా బాక్స్ ఆఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేసి సంచలన కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపింది. రీసెంట్ టైం లో లాంగ్ రన్ ని సొంతం చేసుకున్న అతి కొద్ది సినిమాల్లో ఒకటిగా నిలిచిన అఖండ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర….
టోటల్ రన్ అయ్యే సరికి ఏకంగా 75 కోట్లకు పైగా షేర్ ని సొంతం చేసుకుని సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది, కొన్ని సెంటర్స్ 100 రోజులు పూర్తీ చేసుకున్న తర్వాత కూడా సినిమా ఇప్పుడు ఒక సెంటర్ లో ఏకంగా 175 రోజులు పూర్తీ చేసుకుని సంచలనం సృష్టించింది.
సినిమా ఆంధ్రప్రదేశ్ లో చిలకలూరిపేట లోని రామకృష్ణ థియేటర్ లో ఏకంగా 175 రోజులు ప్రదర్శితం అయింది. టాలీవుడ్ లో ఇలా రీసెంట్ టైం లో 175 రోజులు జరుపుకోవడం పూర్తిగా ఆగిపోగా ఇప్పుడు అఖండ 175 రోజులను పూర్తీ చేసుకోవడంతో సోషల్ మీడియా లో మరోసారి సినిమా పై చర్చలు జరుగుతూ ఉండటం విశేషం.