నట సింహం నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను ల కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ అఖండ బాక్స్ ఆఫీస్ దగ్గర డిసెంబర్ 2 న గ్రాండ్ రిలీజ్ కి సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే. సినిమా పై అంచనాలు ఓ రేంజ్ లో ఉండగా బాలయ్య బోయపాటి శ్రీను ల కాంబో లో వస్తున్న మూడో సినిమా అవ్వడం మొదటి 2 సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాలు గా….
నిలవడంతో ఆ ఇంపాక్ట్ ఈ సినిమా కూడా గట్టిగానే ఉండి బిజినెస్ ఓ రేంజ్ లో జరిగేలా చేసింది… అన్ని ఏరియాల్లో బాలయ్య కెరీర్ బిగ్గెస్ట్ అందుకున్న ఎన్టీఆర్ కథానాయకుడు బిజినెస్ తర్వాత ప్లేస్ లో ఈ సినిమా బిజినెస్ జరుగుతూ వెళ్ళింది కానీ ఇప్పుడు దెబ్బ పడింది.
ఆంధ్రలో రీసెంట్ గా జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సినిమా టికెట్ రేట్లు అన్ని ఎంత ఉండాలి అన్నది అఫీషియల్ గా చెప్పగా ఎలాంటి స్పెషల్ షోలు, రోజుకి కేవలం 4 షోలు మాత్రమే ఉంటాయని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేశారు. దాంతో ఇది అప్ కమింగ్ మూవీస్ అన్నింటికీ కూడా గట్టి దెబ్బ కొట్టగా…
ఆ ఇంపాక్ట్ ఇప్పుడు అఖండ నుండే మొదలు అవ్వగా ఎలాంటి స్పెషల్ షోలు, ఫ్యాన్ షోలు లేకుండా నార్మల్ టికెట్ రేట్లతో రిలీజ్ కాబోతుండటంతో భారీ రేట్లు పెట్టి కొన్న బయ్యర్లు ఇప్పుడు రేట్లు తగ్గించమని టీం ని కోరడంతో అన్ని ఏరియాల్లో కూడా 60 లక్షల నుండి 1 కోటి దాకా బిజినెస్ ఇప్పుడు తగ్గిపోతుందని అంటున్నారు… ఆంధ్రలో ఇప్పుడు మారిన బిజినెస్ లెక్క ముందు అనుకున్న లెక్క కన్నా..
కొంచం తగ్గి ఉండబోతుంది అని చెప్పాలి. ఈ ఇంపాక్ట్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఓపెనింగ్స్ రూపంలో ఉండే అవకాశం ఉండగా పరిస్థితులు సెట్ అయ్యేలా లేకపోవడంతో అఖండ తర్వాత వచ్చే పెద్ద సినిమాలకు కూడా ఇది జరిగి మరోసారి బిజినెస్ లలో మార్పులు జరిగే అవకాశం ఎంతైనా ఉందని అంటున్నారు. ఆ ఇంపాక్ట్ ఎఫెక్ట్ ఎన్ని కోట్లు అన్నది త్వరలో తేలనుంది.