Home TRP రేటింగ్ 50L రేటు…డబుల్ బ్లాక్ బస్టర్ మూవీ…సెన్సేషనల్ TRP రేటింగ్!

50L రేటు…డబుల్ బ్లాక్ బస్టర్ మూవీ…సెన్సేషనల్ TRP రేటింగ్!

0

కోలివుడ్ లో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఎదిగి ఇప్పుడు స్టార్ హీరోలలో తానూ ఒకడిగా నిలిచే రేంజ్ సక్సెస్ ను సొంతం చేసుకున్న యాక్టర్ శివ కార్తికేయన్… టెలివిజన్ షోలలో యాంకర్ గా ప్రయాణం మొదలు పెట్టి ఇప్పుడు హీరోగా అశేష అభిమానులను సొంతం చేసుకున్న శివ కార్తికేయన్ నటించిన లేటెస్ట్ మూవీ డాక్టర్ సినిమా తెలుగు లో వరుణ్ డాక్టర్ పేరుతో డబ్ అయ్యి ఎలాంటి అంచనాలు ఏమి లేకుండా…

రిలీజ్ అవ్వగా బాక్స్ ఆఫీస్ దగ్గర మౌత్ టాక్ బాగుండటం ఎంటర్ టైన్ మెంట్ అదిరిపోవడంతో బాక్స్ ఆఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేసి తెలుగు మూవీస్ ని మించి కలెక్షన్స్ ని సొంతం చేసుకుని ఓవరాల్ గా పెట్టిన రేటు మీద ఎక్స్ లెంట్ ప్రాఫిట్స్ తో…

సంచలనం సృష్టించి దుమ్ము లేపింది ఈ సినిమా. 1 కోటి టార్గెట్ కి టోటల్ రన్ లో ఏకంగా 2.46 కోట్ల షేర్ తో 1.46 కోట్ల ప్రాఫిట్ తో సెన్సేషనల్ డబుల్ బ్లాక్ బస్టర్ ప్లస్ గా నిలిచిన ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ని రిలీజ్ కన్నా ముందే తెలుగు లో…

సన్ టీవీ వాళ్ళు సొంతం చేసుకున్నారు. ఆల్ మోస్ట్ 50 లక్షల రేంజ్ రేటు ని సినిమాకి చెల్లించారు. అంటే తెలుగు లో బిజినెస్ 80 లక్షల రేటు పలకగా శాటిలైట్ రైట్స్ కింద 50 లక్షల రేటు పలికింది. ఈ రేటు కి టెలివిజన్ లో కూడా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అనిపించే రేంజ్ రేటింగ్ ను సొంతం చేసుకుంది. సినిమాను ఎక్కువగా యూత్ థియేటర్స్ లో చూశారు.

ఫ్యామిలీ ఆడియన్స్ కి హీరో పెద్దగా పరిచయం లేకున్నా కానీ ఫస్ట్ టైం టెలికాస్ట్ అయినప్పుడు ఈ సినిమా 5.43 TRP రేటింగ్ ను సొంతం చేసుకుని దుమ్ము లేపింది. పెట్టిన రేటు ప్రకారం చూసుకుంటే ఇది సెన్సేషనల్ రేటింగ్ అనే చెప్పాలి. ఇక లాంగ్ రన్ లో కూడా ఈ సినిమా రేటింగ్ ల పరంగా కుమ్మేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here