బాక్స్ ఆఫీస్ దగ్గర అఖండ పెర్ఫార్మెన్స్ అన్ ప్రిడిక్టబుల్ గా ఉందని చెప్పాలి. హాలిడే నుండి వర్కింగ్ డే టైం లో డ్రాప్స్ హెవీగా ఉంటున్నా కానీ తిరిగి మరో వర్కింగ్ డే కి వచ్చే సరికి హోల్డ్ మాత్రం సాలిడ్ గా ఉంటుంది, ఫస్ట్ వీక్ లో కూడా ఇదే జరగగా ఇప్పుడు రెండో వీక్ లో కూడా ఇదే జరిగింది. సినిమా రెండో వీక్ వర్కింగ్ డే లో గట్టి…
డ్రాప్స్ ను సొంతం చేసుకుంది… దాంతో 13 వ రోజు కూడా సినిమా ఆన్ లైన్ టికెట్ సేల్స్ డ్రాప్స్ గట్టిగానే ఉండగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 50 లక్షల రేంజ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుంది అనుకున్నాం కానీ సినిమా అంచనాలను మించిపోయింది. ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లో సినిమా…
అద్బుతమైన జోరు ని చూపెట్టి 13 వరోజు ఏకంగా 74 లక్షల షేర్ ని అందుకుని అంచనాలను మించిపోయింది. 12 వ రోజు తో పోల్చితే డ్రాప్స్ కేవలం 10 లక్షలు మాత్రమే ఉంది అంటే ఏ రేంజ్ లో సినిమా హోల్డ్ చేసిందో అర్ధం చేసుకోవచ్చు. ఇక అఖండ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…
మొత్తం మీద 13 రోజులు పూర్తీ అయ్యే టైం కి సాధించిన టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 18.09Cr
👉Ceeded: 13.87Cr
👉UA: 5.61Cr
👉East: 3.77Cr
👉West: 3.09Cr
👉Guntur: 4.37Cr
👉Krishna: 3.30Cr
👉Nellore: 2.38Cr
AP-TG Total:- 54.48CR(88.90CR~ Gross)
Ka+ROI: 4.30Cr
OS – 5.10Cr
Total WW: 63.88CR(109.5CR~ Gross)
ఇదీ సినిమా టోటల్ గా 13 రోజుల కలెక్షన్స్ లెక్క…
సినిమాను 53 కోట్ల రేటు కి అమ్మగా సినిమా 54 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగగా మొత్తం మీద 13 రోజుల తర్వాత సాధించిన కలెక్షన్స్ తో సినిమా 9.88 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుని ఇప్పుడు హిట్ నుండి సూపర్ హిట్ గా నిలిచింది అని చెప్పాలి. ఇక లాంగ్ రన్ లో ఎంత వరకు వెళ్ళగలుగుతుందో చూడాలి ఇక.