Home న్యూస్ ఫస్ట్ రికార్డ్ ఔట్….పుష్పరాజ్ మాస్ భీభత్సం!

ఫస్ట్ రికార్డ్ ఔట్….పుష్పరాజ్ మాస్ భీభత్సం!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ రాంపేజ్ చూపెట్టడానికి సిద్ధం అయ్యింది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పుష్ప… డిసెంబర్ 17న అత్యంత భారీ ఎత్తున రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతున్న ఈ సినిమా మీద ఆడియన్స్ లో అంచనాలు అయితే మరో లెవల్ లో ఉన్నాయి. అల వైకుంఠ పురంలో లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత అల్లు అర్జున్, రంగస్థలం లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత సుకుమార్ లు…

కలిసి చేస్తున్న ఈ సెన్సేషనల్ మూవీ మీద అంచనాలు ఆటోమాటిక్ గా పెరిగి పోవడం ఖాయం, ఆ అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో అన్నదానికి ఇప్పుడు ఇదే నిదర్శనం అని చెప్పొచ్చు. మాస్ బొమ్మలు అంటే పెద్దగా ఇంట్రెస్ట్ చూపని ఓవర్సీస్ ఆడియన్స్ రీసెంట్ గా…

అఖండ సినిమాను అనుకున్న దానికన్నా డబుల్ రేంజ్ లో ఆదరించారు. ఇప్పుడు పుష్ప ఊరమాస్ బొమ్మ, అయినా కానీ అమెరికాలో సినిమా టికెట్ సేల్స్ మరో లెవల్ లో జరుగుతూ ఉండగా రీసెంట్ గా వచ్చిన అఖండ సినిమా ఈ ఇయర్ కి గాను అమెరికాలో ప్రీ సేల్స్ ద్వారానే అక్కడ…

ఆల్ మోస్ట్ 280K డాలర్స్ ను అందుకోగా ఇప్పుడు పుష్ప ఆల్ రెడీ 350K మార్క్ ని అధిగమించి 400K మార్క్ ని అందుకునేలా దూసుకు పోతుంది. దాంతో ఈ ఇయర్ కి గాను ఫస్ట్ రికార్డ్ ను ఆల్ రెడీ సొంతం చేసుకుంది పుష్ప సినిమా. ఇక సినిమా ఊపు చూస్తుంటే అమెరికాలో షోలు ఆన్ టైం కి సరిగ్గా ఇబ్బంది లేకుండా పడితే….

ప్రీమియర్స్ కే మినిమమ్ హాల్ఫ్ మిలియన్ ను సొంతం చేసుకునే అవకాశం ఉందని అంటున్నారు. మాగ్జిమం 600K టు 700K మార్క్ ని కూడా అందుకునే అవకాశం ఉందని చెబుతూ ఉండటం విశేషం. బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాలలో కూడా సినిమా ఊహకందని సంచలనం సృష్టించే అవకాశం కూడా ఎంతైనా ఉందని చెప్పొచ్చు ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here