Home న్యూస్ నైట్ షోలు కాన్సిల్, థియేటర్స్ సీజ్…ఏం జరుగుతుంది అసలు!

నైట్ షోలు కాన్సిల్, థియేటర్స్ సీజ్…ఏం జరుగుతుంది అసలు!

0

నట సింహం నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీనుల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ అఖండ బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అవ్వగా తెలుగు రాష్ట్రాలలో 925 థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 1550 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ అయింది. తెలుగు రాష్ట్రాలలో నైజాం ఏరియాలో కొన్ని చోట్ల స్పెషల్ షోలు ఎలాంటి ఇబ్బంది లేకుండా పడ్డాయి. ఇక ఆంధ్ర్రలో ఎప్పటి నుండో….

స్పెషల్ షోలు కానీ బెనిఫిట్ షోలు కానీ సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి… కానీ ఈ ఇయర్ వకీల్ సాబ్ రిలీజ్ నుండి ప్రభుత్వం టికెట్ రేట్లు తగ్గించడం అలాగే రోజుకి కేవలం 4 షోలు మాత్రమే వేసుకోవాలంటూ గట్టి నిర్ణయాలు తీసుకోగా రీసెంట్ గా అఖండ రిలీజ్ టైం కన్నా ముందు….

మరోసారి టికెట్ రేట్లు అలాగే రోజుకి 4 షోలు మాత్రమే వేయాలని నిర్ణయం తీసుకున్నారు. కానీ ఆంధ్రలో కొన్ని చోట్ల పర్మీషణ్ తోనో కొన్ని చోట్ల ఎలాంటి పర్మీషణ్ లేకుండా సినిమా కి మార్నింగ్ షోలు వేశారు. ఆ విషయం తర్వాత అధికారుల నుండి పెద్దలకి వెళ్ళడంతో వాళ్ళు…

ఈవినింగ్ షోల టైం కి సీరియస్ అయ్యి కొన్ని చోట్ల థియేటర్స్ ని సీజ్ చేశారు… దాంతో ఆగకుండా మరికొన్ని చోట్ల మీరు రోజుకి నాలుగే షోలు వేయాలి కదా బెనిఫిట్ షో వేశారు కాబట్టి ఇక మీరు సెకెండ్ షోలు అసలు వేయడానికి వీలు లేదు అంటూ గట్టి వార్నింగ్ లు ఇచ్చి ఒకవేళ షో కనుక వేస్తె కచ్చితంగా థియేటర్స్ ని సీజ్ చేస్తామని…

గట్టి వార్నింగ్ లు ఇచ్చారు… ఇలా ప్రభుత్వం ఆంధ్రలో వేర్ సమస్యలు ఏమి లేనట్లు కేవలం సినిమాలు థియేటర్స్ టికెట్స్ అంటూ ఇండస్ట్రీ మీదనే ఎందుకని ఇంతలా ఫోకస్ చేస్తుందో ఎవ్వరికీ అంతుపట్టడం లేదు. ఇక ఈ ఇంపాక్ట్ వలన అప్ కమింగ్ మూవీస్ కూడా కలెక్షన్స్ ఇంపాక్ట్ ఉండొచ్చు. దీనిపై ఇండస్ట్రీ పెద్దలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here