సెకెండ్ వేవ్ తర్వాత టాలీవుడ్ నుండి వరుస పెట్టి సినిమాలు ఆడియన్స్ ముందుకు వస్తున్నప్పటికీ కూడా ఓ పెద్ద స్టార్ సినిమా రిలీజ్ అయితే ఉండే హడావుడి… హంగామా కోసం అందరూ ఆశగా ఎదురు చూస్తున్న టైం లో నట సింహం నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీనుల కాంబినేషన్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన లేటెస్ట్ మూవీ అఖండ గ్రాండ్ రిలీజ్ నూ సొంతం చేసుకుని ఆల్ మోస్ట్ 1550 కి పైగా థియేటర్స్ లో…
గ్రాండ్ రిలీజ్ ను సొంతం చేసుకోగా తెలుగు స్టేట్స్ లో బెనిఫిట్ షోలు పడక పోవడంతో ఉదయం స్పెషల్ షోలు చాలా తక్కువ చోట్ల పడటంతో బొమ్మ బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగినట్లు అయింది. అల్టిమేట్ క్రేజ్ తో థియేటర్ల ముందు థియేటర్స్ లో ఫ్యాన్స్ హంగామాతో…
మాస్ జాతరని తలపిస్తూ బరిలోకి దిగిన అఖండ ఇక బాక్స్ ఆఫీస్ ను షేక్ చేయడం ఒక్కటే బాలన్స్ అని చెప్పాలి. ఫస్ట్ డే ఫ్యాన్స్ తో సందడి ఉంటుంది, బాలయ్య బోయపాటి కాంబో మూవీకి ఫ్యామిలీస్ కూడా ఇది వరకు భారీగా వచ్చారు కాబట్టి ఈ సినిమాతో అది రిపీట్ అయితే ఇక కలెక్షన్స్ దుమ్ము లేవడం ఖాయమని చెప్పాలి.