నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ అఖండ బాక్స్ ఆఫీస్ దగ్గర అల్టిమేట్ కలెక్షన్స్ తో ఓవరాల్ గా సెన్సేషనల్ ప్రాఫిట్స్ ను సొంతం చేసుకుంటూ దూసుకు పోతుంది. సినిమా సెకెండ్ వీకెండ్ పూర్తీ అయ్యే టైం కి వరల్డ్ వైడ్ గా ఎక్స్ లెంట్ అనిపించే విధంగా తెలుగు రాష్ట్రాలలో 86.35 కోట్ల గ్రాస్ ను వరల్డ్ వైడ్ గా 105.8 కోట్ల గ్రాస్ తో దుమ్ము దుమారం చేసింది అని చెప్పాలి.
కానీ అదే టైం లో సినిమాకి ఆంధ్రలో టికెట్ హైక్స్ ఇవ్వక పోవడంతో గట్టి ఎదురుదెబ్బ తగిలింది, మొదటి రోజే బెనిఫిట్ షోలు, టికెట్ హైక్స్, స్పెషల్ షోలు లాంటివి ఉండి ఉంటే బిజినెస్ వేటలో అప్పటి నుండే సంచలనం సృష్టించేది కానీ అవేవి లేక పోవడం నార్మల్ టికెట్ రేట్స్ తోనే…
సినిమా రన్ ని కొనసాగిస్తూ ఉండగా ఇప్పుడు 11 రోజులు పూర్తీ అయిన తర్వాత నైజాం, సీడెడ్ ఏరియాలు ఆల్ రెడీ ప్రాఫిట్ జోన్ లో ఉండగా ఆంధ్ర రీజన్ లో ఒక్క నెల్లూరు ఏరియాలోనే సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యింది. మిగిలిన ఏ ఏరియాలో కూడా ఇంకా బిజినెస్ ను…
అఖండ సినిమా అందుకోలేదు… ఒకసారి తెలుగు రాష్ట్రాలలో సినిమా ఏరియాల వారి బిజినెస్ అండ్ రికవరీని గమనిస్తే…
👉Nizam: 17.47/10.5Cr✅
👉Ceeded: 13.51/10.6Cr✅
👉UA: 5.43/6Cr
👉East: 3.68/4Cr
👉West: 3.00/3.5Cr
👉Guntur: 4.28/5.4Cr
👉Krishna: 3.22/3.7Cr
👉Nellore: 2.31/1.8Cr✅
AP-TG Total:- 52.90CR/45.5Cr✅
3 ఏరియాలు మాత్రమే రికవరీ అవ్వగా లాంగ్ రన్ లో మరి కొన్ని ఏరియాలు రికవరీ అయ్యే….
అవకాశం ఉండగా కొన్ని ఏరియాలు మాత్రం ఎఫెక్ట్ అయ్యేలానే ఉన్నాయి అని చెప్పాలి. తెలుగు రాష్ట్రాలలో 45.5 కోట్ల బిజినెస్ మీద 7.4 కోట్లు అధికంగా వసూల్ చేసినప్పటికీ కూడా కొన్ని ఏరియాలు దెబ్బ పడటం ప్రస్తుతం ఆంధ్రలో ఉన్న పరిస్థితులకు నిదర్శనం అని చెప్పాలి. అందుకే అన్ని సినిమాల మేకర్స్ టికెట్ హైక్స్ కోసం ట్రై చేస్తున్నారు కానీ కుదరడం లేదు.