బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ హిట్స్ కి ఫ్లాఫ్స్ కి సంభందం లేకుండా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రతీ ఏడాది కూడా మినిమమ్ 3 నుండి 4 సినిమాలను కంటిన్యుగా రిలీజ్ చేస్తూ ఉంటాడు, అందులో మినిమమ్ రెండు సినిమాలకు తగ్గకుండా విజయాలను నమోదు చేసుకునే అక్షయ్ కుమార్ రీసెంట్ టైం లో కెరీర్ బెస్ట్ ఫాం లో ఉన్నాడు. అప్పుడెప్పుడో 2007 టైం లో ఇలా వరుస విజయాలతో దూసుకు పోయిన అక్షయ్ కుమార్ మళ్ళీ….
2019 ఇయర్ నుండి వరుస విజయాలతో దూసుకు పోతుండగా ఇలా ఇన్ని సినిమాలు ఎలా చేస్తారు అని అడిగితె, రోజు కి 8 గంటలు పని ఉండాల్సిందే. ఆ పని ప్రతీ రోజూ చేయాల్సిందే అనేది నా రూల్, అందుకే ప్రతీ రోజూ 8 గంటల షూటింగ్ చేస్తా… వీకెండ్ హాలిడే తీసుకుంటా..
ఇలా చేస్తాను కాబట్టే ఇయర్ కి 4 సినిమాలు రిలీజ్ చేస్తున్నా అని చెప్పుకొచ్చారు అక్షయ్… కానీ కరోనా వల్ల తన అప్ కమింగ్ సినిమాల షెడ్యూల్ ఆగిపోగా… తన కొత్త సినిమా బెల్ బాటం షూటింగ్ ని రీసెంట్ గా స్కాట్లాండ్ లో మొదలు పెట్టిన అక్షయ్ 14 రోజుల క్వారంటైన్ తర్వాత షూటింగ్ లో పాల్గొనగా…
షూటింగ్ లేట్ వల్ల యాక్టర్స్ డేట్స్ ఇబ్బందులు రావడం తో లాస్ లో ఉన్న నిర్మాత ని ఆదుకోవడానికి అక్షయ్ కొత్త నిర్ణయం తీసుకున్నాడట. 18 ఏళ్ల క్రితం కూడా వరుస సినిమాలు చేసే అక్షయ్ రోజుకి డబుల్ షిఫ్ట్ లు పనిచేయగా తర్వాత రోజుకి 8 గంటలు పని చేయడం మొదలు పెట్టగా… మళ్ళీ ఇప్పుడు 18 ఏళ్ల తర్వాత బెల్ బాటం నిర్మాత కోసం…
రెండు షిఫ్ట్ లు స్కాట్లాండ్ లో పని చేస్తున్నారట. ఒక టీం మొత్తం ఉదయం నుండి సాయంత్రం ముందు వరకు షెడ్యూల్ చేయగా, మరో యూనిట్ సాయంత్రం నుండి నైట్ వరకు షెడ్యూల్ చేస్తున్నారట. దాంతో డే టైం షూటింగ్ అలాగే నైట్ షూటింగ్ ని నైట్ కి షిఫ్ట్ చేసి సినిమాను త్వరగా కంప్లీట్ చేసి నిర్మాత కి నష్టం లేకుండా చూస్తున్నాడట అక్షయ్… దాంతో నిర్మాత అక్షయ్ ని ఆకాశానికి ఎత్తేసేలా పొగడ్తలతో ముంచెత్తాడని అంటున్నారు.