కరోనా టైం లో థియేటర్స్ అన్ని మూత పడటం తో దాదాపు అన్ని సినిమాలు కూడా థియేటర్స్ లో కాకుండా డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ కి ఎక్కువ ప్రాదాన్యత ఇస్తూ రాగా, ఇది అన్ని ఇండస్ట్రీ ల కన్నా ముందు మొదలు పెట్టిన బాలీవుడ్ చిన్న పెద్దా అని తేడా లేకుండా దాదాపు అన్ని సినిమాలను కూడా డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ చేయడనికి భారీ ఒప్పందాలు జరిపిన విషయం తెలిసిందే.
అన్ని సినిమాల లోకి హైయెస్ట్ రేటు ని సొంతం చేసుకున్న సినిమా అక్షయ్ కుమార్ నటించిన లక్ష్మీ బాంబ్ సినిమా. కాంచన సినిమా కి సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమా ఏకంగా 125 కోట్ల డీల్ ని ఫైనల్ చేసుకోగా సినిమా ఈ పాటికే రిలీజ్ అవ్వాల్సింది కానీ…
కొన్ని కారణాల వల్ల రిలీజ్ కాలేదు, త్వరలో అవుతుంది అనుకుంటే ఇప్పుడు టీం ఒక షాకింగ్ నిర్ణయం తీసుకుంది అని సమాచారం.. రీసెంట్ గా ఇండియా వైడ్ గా ఉన్న థియేటర్స్ ఓనర్స్ అందరూ కూడా థియేటర్స్ ని రీ ఓపెన్ చేయాలి అంటూ గట్టి పోటి చేయడం తో…
ప్రభుత్వం త్వరలోనే దీని పై ఒక నిర్ణయం తీసుకోబోతుందని సమాచారం… అన్నీ అనుకున్నట్లు జరిగితే, వచ్చే నెల దసరా టైం నుండి థియేటర్స్ రీ ఓపెన్ అయ్యే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్న నేపధ్యంలో లక్ష్మీ బాంబ్ టీం థియేటర్ ఓనర్ల పోరాటానికి తలొగ్గి తమ సినిమాను ఇప్పుడు థియేటర్స్ లోనే రిలీజ్ చేయాలి అని నిర్ణయం తీసుకున్నారు అని బాలీవుడ్ లేటెస్ట్ టాక్.
కానీ ఒక్క సారి అగ్రిమెంట్ జరిగితే దాన్ని బ్రేక్ చేయడం ఉండదు, మరి టీం ఎలా ఫైనల్ నిర్ణయం తీసుకుంటుంది అన్నది త్వరలో తెలుస్తుంది, ఈ కారణం వల్లే సినిమా ట్రైలర్ ఈ పాటికే రావాల్సి ఉన్నా ఆపారని అంటున్నారు. మరి టీం ఫైనల్ గా థియేటర్స్ లోనే అంటారా లేక అగ్రిమెంట్ ప్రకారం డైరెక్ట్ రిలీజ్ చేస్తారా అన్నది త్వరలో తేలనుంది…