Home న్యూస్ 40 కోట్ల బడ్జెట్…బిజినెస్ లెక్క తెలిస్తే మైండ్ బ్లాంక్!!

40 కోట్ల బడ్జెట్…బిజినెస్ లెక్క తెలిస్తే మైండ్ బ్లాంక్!!

0

కరోనా ఎఫెక్ట్ తో సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయో అన్న క్లారిటీ ఎవ్వరికీ లేకుండా పోయింది. ఇప్పటికే ఆల్ మోస్ట్ మూడు నెలలకు పైగా సమయం అవ్వగా మరో మూడు నెలలు మినిమమ్ అయ్యేలా పరిస్థితులు ఉన్నాయి. ఇక ఈ టైం లో రిలీజ్ కి సిద్ధంగా ఉన్న సినిమా లకు డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ ఓ వరంలా మారింది అని చెప్పాలి. క్రేజీ ఆఫర్ వచ్చిన వెంటనే నిర్మాతలు సినిమాలను….

డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక రీసెంట్ గా ఇలా కన్ఫాం అయిన సినిమాల్లో బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ నటించిన కాంచన 2 హిందీ రీమేక్ లక్ష్మీ బాంబ్ కూడా ఒకటి. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయ్యి ఉంటె…

మినిమమ్ లో మినిమమ్ 150 కోట్లకు తగ్గని కలెక్షన్స్ ని అందుకునేది కానీ ప్రస్తుతం పరిస్థితులు అలా లేవు కాబట్టి ఈ సినిమా కి డిజిటల్ రిలీజ్ గాను ఏకంగా 125 కోట్ల రేటు ఆఫర్ రావడం తో అమ్మేశారు. ఇక సినిమా కి అయిన బడ్జెట్ మాత్రం కేవలం 40 కోట్లు మాత్రమె అంటే కొద్దిగా షాకింగ్  గానే ఉంటుంది కానీ…

అక్షయ్ కుమార్ రెమ్యునరేషన్ తీసుకోకుండా సినిమా టోటల్ బిజినెస్ అండ్ కలెక్షన్స్ లో పెర్సేంటేజ్ తీసుకుంటారు. అందుకే సినిమా బడ్జెట్ కేవలం 40 కోట్ల లోపే అయిందట. ఇక సినిమా శాటిలైట్ రైట్స్ అండ్ మ్యూజిక్ రైట్స్ రేట్లు ఇంకా రివీల్ అవ్వలేదు కానీ అవి రెండూ కలిపి ఆల్ మోస్ట్ 100 కోట్ల రేంజ్ లో…

రేటు ఉంటుందని అంటున్నారు. అంటే ఆల్ మోస్ట్ 225 కోట్ల రేంజ్ బిజినెస్ ని ఈ సినిమా సొంతం చేసుకుంటుంది, కేవలం 40 కోట్ల రేంజ్ బడ్జెట్ తో ఏకంగా 225 కోట్ల రేంజ్ బిజినెస్ అంటే నిర్మాతకు ఎ రేంజ్ లో ప్రాఫిట్స్ వచ్చి ఉంటాయో అర్ధం చేసుకోవచ్చు, ఇక ఇందులో అక్షయ్ కుమార్ కి రెమ్యునరేషన్ కింద భారీ అమౌంట్ వెళుతుందని సమాచారం….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here