Home న్యూస్ భానుమతి అండ్ రామకృష్ణ రివ్యూ….కుమ్మంది బొమ్మ!!

భానుమతి అండ్ రామకృష్ణ రివ్యూ….కుమ్మంది బొమ్మ!!

0

 

కరోనా ఎఫెక్ట్ తో సినిమాలు థియేటర్స్ లో కాకుండా డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ ని సొంతం చేసుకుంటూ ఉండగా ఇప్పటికే అన్ని ఇండస్ట్రీ ల నుండి 10 కి పైగానే వివిధ సినిమా లు డైరెక్ట్ రిలీజ్ సొంతం చేసుకోగా కొన్ని మాత్రమె అంచనాలను అందుకున్నాయి. అందులో రీసెంట్ గా తెలుగు లో వచ్చిన కృష్ణ అండ్ హిస్ లీల మెప్పించాగా ఇప్పుడు మరో లవ్ స్టొరీ భానుమతి అండ్ రామకృష్ణ సినిమా డైరెక్ట్ రిలీజ్ ని సొంతం చేసుకుంది.

అందాల రాక్షసి ఫేం నవీన్ చంద్ర కొత్తమ్మాయి సలోని లుథ్రా ల కాంబినేషన్ లో శ్రీకాంత్ నగోతి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఆహా వీడియో లో రీసెంట్ గా రిలీజ్ అయింది, మరి సినిమా ఎలా ఉంది, అంచనాలను అందుకుందో లేదో తెలుసుకుందాం పదండీ….

కథ పాయింట్ కి వస్తే కి…30 ఏళ్ళు అయినా పెళ్లి కానీ హీరోయిన్ ఇతరులతో సరిగ్గా ఇమడలేని తన వ్యక్తిత్వం వలన లవ్ బ్రేకప్ అయ్యి ఉంటుంది, అప్పుడే నెమ్మదస్తుడు అయిన హీరో ఆమెకి పరిచయం అవ్వడం, మొదట్లో నచ్చకపోయినా తర్వాత హీరోయిన్ కి హీరో నచ్చడం…

కానీ చిన్న కాంప్లికేషన్ ఉండటం జరుగుతుంది, మరి చివరికి ఇద్దరు కలిసారా లేదా అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. టాలీవుడ్ లో హీరో సినిమా లో ఉన్నా పూర్తిగా హీరోయిన్ మీదే సినిమా నడిచే అతి కొద్ది సినిమాల్లో ఈ సినిమా కూడా ఒకటని చెప్పాలి. కొత్తమ్మాయి సలోని లుథ్రా ఫస్ట్ మూవీ అయినా కానీ…

అద్బుతంగా నటించి మెప్పించాగా తన పాత్రని డైరెక్టర్ అద్బుతంగా తీర్చి దిద్దాడు. తన పెర్ఫార్మెన్స్ కూడా బాగుందని చెప్పాలి. ఇక హీరో నవీన్ చంద్ర కూడా తన కెరీర్ లో డిఫెరెంట్ రోల్ చేసినా బెస్ట్ అనిపించే పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. తన పెర్ఫార్మెన్స్ తో సినిమా ను మరింత ఆసక్తి కలిగించేలా చేశాడు.

మిగిలిన నటీనటులు కూడా ఉన్నంతలో మెప్పించగా ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే చివరి టైం లో తప్పితే మిగిలిన సినిమా మొత్తం పెర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది. కొన్ని కొన్ని సీన్స్ మరి వివరించి చెప్పకుండా జస్ట్ ఇంటర్ లింక్ సీన్స్ తో ఆడియన్స్ కి అర్ధం అయ్యేలా డైరెక్ట్ తెరకెక్కిస్తే…

అదే రేంజ్ లో ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే కూడా రాసుకుని మెప్పించారు. సంగీతం అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమా ఫీల్ కి తగ్గట్లు ఉందని చెప్పొచ్చు. ఇక డైరెక్షన్ పరంగా శ్రీకాంత్ నగోతి మంచి పాయింట్ తో సినిమా చాలా క్రిస్ప్ గా గంటన్నర వ్యవధిలో ముగించేలా రాసుకుని మెప్పించాడు కానీ…

క్లైమాక్స్ కి ముందు హడావుడిగా సినిమా ముగించాలి అని తొందరపడినట్లు సినిమా ను గంటన్నరకే పరిమితం చేయడంలో కొద్దిగా తప్పు జరిగిందని అనిపించింది, ఇంకొంచం టైం తీసుకుని, అప్పటి వరకు ఎవ్వరూ నచ్చని హీరోయిన్ కి నవీన్ చంద్ర ఎందుకని నచ్చాడో అన్నది మరింత వివరించి చెప్పి ఉంటె…

మరింత బాగుండేది, అదే సమయం లో కొన్ని కొన్ని చోట్ల నవీన్ చంద్ర పెర్ఫార్మెన్స్ కొంచం అతిగా అనిపించేలా ఉంటుంది, అవి కొద్దిగా చూసుకుని ఉంటె బాగుందని అనిపించింది. ఇది తప్పితే సినిమా లో పెద్దగా మైనస్ లు ఏవి లేవనే చెప్పాలి. ఒక రెగ్యులర్ మూవీ ల కాకుండా ఎక్స్ టెండెడ్ షార్ట్ ఫిల్మ్ చూసిన భావన కొద్దిగా కలిగినప్పటికీ…

ఈజీగా ఒకసారి సినిమా చూసి చాలా వరకు ఎంజాయ్ చేసే విధంగా సినిమా ఉందని చెప్పొచ్చు. మరీ అద్బుతం అని కాకున్నా కొన్ని కొన్ని లిమిటేషన్స్ ఉన్నా కానీ అవలీలగా భానుమతి అండ్ రామకృష్ణ ఆడియన్స్ ని మెప్పించడం ఖాయం… సినిమా కి మా రేటింగ్…. 3/5 స్టార్స్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here