Home TRP రేటింగ్ స్టైలిష్ స్టార్ రాంపేజ్…కేరళ గడ్డపై 2వ సారి దుమ్ము లేపే TRP రేటింగ్!!

స్టైలిష్ స్టార్ రాంపేజ్…కేరళ గడ్డపై 2వ సారి దుమ్ము లేపే TRP రేటింగ్!!

0

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి తెలుగు రాష్ట్రాలలో, కర్ణాటక లో ఎలాంటి ఫాలోయింగ్ ఉందో కేరళ లో కూడా అదే రేంజ్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకున్నాడు. తన సినిమాలు అన్నీ కూడా క్రమం తప్పకుండా అక్కడ డబ్ చేస్తూ వచ్చిన అల్లు అర్జున్ ప్రతీ సినిమా తో అక్కడ కూడా తన రేంజ్ ని పెంచుకుంటూనే వెళ్ళాడు. తన లేటెస్ట్ మూవీ అల వైకుంఠ పురంలో అక్కడ కూడా…

Ala VaikunthaPurramuloo 50 Days Centers List

సాలిడ్ ఓపెనింగ్స్ ని అందుకున్నా లోకల్ మూవీస్ వలన పరుగును చాలా త్వరగా ముగించాల్సి వచ్చింది. అయినా కానీ సినిమా అక్కడ సేఫ్ వెంచర్ గా నిలవగా బాక్స్ ఆఫీస్ తో పాటు బుల్లి తెరపై కూడా అక్కడ దుమ్ము లేపే TRP రేటింగ్ తో సెన్సేషన్ ని క్రియేట్ చేసింది.

అక్కడ లోకల్ మూవీస్ కాకుండా వేరే భాష నుండి వచ్చిన డబ్ మూవీస్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ TRP రేటింగ్ ని అందుకుని మొదటి రికార్డ్ సృష్టించిన అల వైకుంఠ పురం లో సినిమా రీసెంట్ గా రెండో సారి కూడా టెలికాస్ట్ అయ్యి సాలిడ్ TRP రేటింగ్ ని మళ్ళీ అందుకుంది.

మొత్తం మీద సినిమా ఫస్ట్ టైం టెలికాస్ట్ అయినప్పుడు 11.17 TRP రేటింగ్ ని అందుకుని సెన్సేషన్ ని క్రియేట్ చేయగా రెండో సారి రీసెంట్ గా టెలికాస్ట్ అయ్యి సినిమా కి 9.2 TRP రేటింగ్ దక్కింది. దాంతో రెండు సార్లు కూడా సెన్సేషనల్ TRP రేటింగ్ ని అందుకుని దుమ్ము లేపింది స్టైలిష్ స్టార్ పవర్ ఏంటో చూపింది ఈ సినిమా.

అక్కడ ఆ రేంజ్ లో రెచ్చిపోయినా కానీ ఇప్పటి వరకు సినిమా తెలుగు లో టెలికాస్ట్ అవ్వనే లేదు. త్వరలో త్వరలో అంటూ జెమినీ టీవీ వారు ఊరించడమే సరిపోతుంది కానీ టెలికాస్ట్ మాత్రం చేయడం లేదు. ఈ టైం లో చేసి ఉంటే సినిమా కి కూడా ఇక్కడ సెన్సేషనల్ TRP రేటింగ్ అవలీలగా దక్కి ఉండేదని చెప్పొచ్చు….

Ala Vaikunthapurramuloo Total WW Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here