ఒకప్పుడు టాలీవుడ్ లో మినిమమ్ గ్యారెంటీ హీరోగా ఇయర్ కి మినిమమ్ 3-4 సినిమాలను రిలీజ్ చేస్తూ ఎక్కువ హిట్ మూవీస్ నే సొంతం చేసుకుంటూ తనకంటూ ఒక మార్కెట్ ని క్రియేట్ చేసుకున్న హీరోల్లో అల్లరి నరేష్ ఒకరు. కామెడీ ఎంటర్ టైనర్స్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తూ చాలా హిట్ మూవీస్ ని సొంతం చేసుకున్న అల్లరి నరేష్ 2012 టైం లో కెరీర్ బెస్ట్ హిట్ ని సొంతం చేసుకున్నారు.
సుడిగాడు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర స్టార్ హీరోల రేంజ్ ఓపెనింగ్స్ ని అందుకుని భారీ వసూళ్ళతో అల్లరి నరేష్ కెరీర్ లో బిగ్గెస్ట్ రికార్డులను నమోదు చేయగా ఆ సినిమా అందించిన విజయం తో ఇక అల్లరి నరేష్ మరో లెవల్ కి వెళ్ళడం ఖాయమని అంతా అనుకున్నారు.
కానీ సరైన సినిమాలు ఎంచుకోక పోవడం తో కెరీర్ లో డౌన్ ఫాల్ మొదలు అవ్వగా అప్పటి నుండి ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క హిట్ కూడా అల్లరి నరేష్ దరికి చేరలేదు 8 ఏళ్లుగా… ఇలాంటి టైం లో తన పంధాని పూర్తీ గా మార్చుకుని డిఫెరెంట్ కాన్సెప్ట్ తో చేస్తున్న….
హానెస్ట్ మూవీ నాంది…. రీసెంట్ గా సినిమా టీసర్ కూడా రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకోగా సినిమా ను థియేటర్స్ రీ ఓపెన్ అయ్యాక రిలీజ్ చేస్తారని టాక్ వచ్చినా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వారు ఈ సినిమా హక్కులను తీసుకోబోతున్నారన్న టాక్ ఇండస్ట్రీ లో చక్కర్లు కొడుతుంది. ఆ టాక్ ప్రకారం సినిమా కి…
అమెజాన్ ప్రైమ్ 8.3 కోట్ల దాకా రేటు చెల్లించడానికి ముందుకు వచ్చిందని తెలుస్తుంది. రీసెంట్ అల్లరి నరేష్ మూవీస్ పెర్ఫార్మెన్స్ కన్నా కూడా ఇది ఎక్కువ రేటు అనే చెప్పాలి. దాంతో సినిమాను ప్రైమ్ కి అమ్మేయాలని యూనిట్ భావిస్తున్నారని నవంబర్ లో సినిమా డైరెక్ట్ రిలీజ్ కావొచ్చని అంటున్నారు.