Home న్యూస్ ఇండియన్ రికార్డ్ కొట్టిన అల్లుఅర్జున్…..300M** ఏంటి సామి!!

ఇండియన్ రికార్డ్ కొట్టిన అల్లుఅర్జున్…..300M** ఏంటి సామి!!

0

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి తెలుగు లో ఎంత క్రేజ్ ఉందో నార్త్ లో కూడా అదే రేంజ్ లో క్రేజ్ ఉందన్న విషయం తెలిసిందే. తను నటించిన సినిమాలు హిందీ లో డబ్ అయ్యి సెన్సేషనల్ వ్యూస్ రికార్డులను నమోదు చేస్తూ దూసుకు పోతూనే ఉన్నాయి… అన్ని సినిమాల రికార్డులు ఒకెత్తు సరైనోడు సినిమా రికార్డులు మరో ఎత్తు అని చెప్పాలి. ఈ సినిమా హిందీ డబ్ వర్షన్…

చాలా సార్లు అప్లోడ్ అయ్యి రికార్డ్ వ్యూస్ అందుకుని కొన్ని కారణాల వల్ల యూట్యూబ్ నుండి తొలగించబడింది. అయినా కానీ మళ్ళీ అప్లోడ్ అయిన ఈ సినిమా లేటెస్ట్ గా ఏ డబ్ మూవీ కూడా సాధించని రేంజ్ లో రికార్డును నమోదు చేస్తూ ఏకంగా…

300 మిలియన్ మార్క్ ని అందుకుని… ఈ రికార్డ్ అందుకున్న మొట్ట మొదటి ఇండియన్ మూవీ గా చరిత్ర సృష్టించింది. మరి కొన్ని సినిమాలు కూడా 300 కి చేరువగా ఉన్నా కానీ ఇన్ని సార్లు తొలగించబడి మళ్ళీ అప్లోడ్ చేశాక కూడా ఇలాంటి రికార్డ్ ను సొంతం చేసుకోవడం అంటీ మామూలు ఊచకోత కాదనే చెప్పాలి.

ఇక మొత్తం మీద సినిమా కి 1.1M కి పైగా లైక్స్ దక్కడం మరో విశేషం అని చెప్పాలి. సినిమా ను తొలగించిన అన్ని వ్యూస్ కూడా కౌంట్ చేస్తే సినిమా ఓవరాల్ గా మినిమమ్ లో మినిమమ్ 500 మిలియన్స్ కి తగ్గని వ్యూస్ ని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉండి ఉండేదని అంటున్నారు..

ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ అల వైకుంఠ పురంలో ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసిన తర్వాత ఇప్పుడు పుష్ప సినిమా తో పాన్ ఇండియా లెవల్ లో తన జోరు చూపడానికి సిద్ధం అవుతున్నాడు అల్లు అర్జున్… త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ జరుపుకొబోతున్న ఈ సినిమా వచ్చే ఇయర్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here