ఈ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన మూవీస్ లో నోటబుల్ రిలీజ్ అయిన అల్లు శిరీష్(Allu Sirish) నటించిన లేటెస్ట్ మూవీ బడ్డీ(Buddy Movie 1st Day Collections) తమిళ్ లో వచ్చిన టెడ్డీ మూవీకి రీమేక్ గా రాగా తెలుగు లో కొన్ని మార్పులు చేర్పులు చేయగా ఆడియన్స్ నుండి రెస్పాన్స్ కొంచం మిక్సుడ్ గా వచ్చింది….
సినిమాను మేకర్స్ బాగానే ప్రమోట్ చేసినా, టికెట్ రేట్స్ ను భారీగా తగ్గించినా కూడా జనాలు అనుకున్న రేంజ్ లో చూడటానికి థియేటర్స్ కి అయితే రాలేదు. ఆన్ లైన్ టికెట్ సేల్స్ లో బుక్ మై షోలో కనీసం 5 వేల టికెట్ సేల్స్ ను కూడా సొంతం చేసుకోలేక పోయిన సినిమా…
ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లో కొన్ని చోట్ల పర్వాలేదు అనిపించినా ఓవరాల్ గా నిరాశ కలిగించే ఓపెనింగ్స్ నే సినిమా సొంతం చేసుకుంది అని చెప్పాలి. మొదటి రోజు మొత్తం మీద సినిమా తెలుగు రాష్ట్రాల్లో 42-45 లక్షల రేంజ్ లో గ్రాస్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా 55 లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది.
మొదటి తెలుగు రాష్ట్రాల్లో 25 లక్షల రేంజ్ లో వరల్డ్ వైడ్ గా 30 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకున్నట్లు అంచనా… ఓవరాల్ గా సినిమా మొదటి రోజు బిలో పార్ కలెక్షన్స్ నే సొంతం చేసుకోగా సినిమా వాల్యూ బిజినెస్ రేంజ్ అటూ ఇటూగా 4 కోట్ల దాకా ఉంటుందని అంచనా…
ఆ లెక్కన సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 4.50 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా చాలా కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక సినిమా వీకెండ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.