Home గాసిప్స్ అల్లు అర్జున్-అట్లీ…..80 కోట్ల రగడ….అసలు ఏం జరిగింది అంటే!

అల్లు అర్జున్-అట్లీ…..80 కోట్ల రగడ….అసలు ఏం జరిగింది అంటే!

0

పుష్ప(Pushpa Movie) పాన్ ఇండియా రేంజ్ లో సెన్సేషనల్ క్రేజ్ ను సొంతం చేసుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) చేస్తున్న లేటెస్ట్ మూవీ పుష్ప2 ది రూల్(Pushpa 2 The Rule) మీద అంచనాలు ఓ రేంజ్ లో ఉండగా సినిమా ఆడియన్స్ ముందుకు ఆగస్టు లో రిలీజ్ అవ్వాల్సింది కానీ ఇంకా షూటింగ్ ఆల్ మోస్ట్ 45 రోజులకు పైగా…

వర్కింగ్ డేస్ బాలెన్స్ ఉండటంతో చేసేదేమీ లేక నిరవధికంగా సినిమాను పోస్ట్ పోన్ చేశారు. దాంతో ఫ్యాన్స్ కి ఒకింత నిరాశ పరిచేలా అనిపించిన ఈ న్యూస్ తర్వాత ఇప్పుడు మరో నిరాశ పరిచే న్యూస్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి సిద్ధంగా ఉంది ఇప్పుడు, అన్నీ అనుకున్నట్లు జరిగితే పుష్ప2 తర్వాత అల్లు అర్జున్ కోలివుడ్ క్రేజీ డైరెక్టర్ అయిన…

అట్లీ డైరెక్షన్ లో మరో బిగ్ పాన్ ఇండియా మూవీ చేయాల్సి ఉంది, అఫీషియల్ గా ఈ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేయకపోయినా కూడా వీళ్ళ కాంబో గురించి ఓపెన్ గానే ట్వీట్స్ తో అనౌన్స్ చేశారు, అల్లు అర్జున్, అట్లీ మరియు అనిరుద్ ల కాంబోలో మూవీ ఉండబోతుంది అంటూ ఊదరగొట్టారు…కానీ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఆల్ మోస్ట్ ఆగిపోయినట్లే అని వార్తలు గట్టిగానే శిఖారు కొడుతున్నాయి…

దానికి కారణం వీళ్ళ కాంబోని సెట్ చేయాలి అని చూస్తున్న నిర్మాతలకు రెమ్యునరేషన్ పరంగా అట్లీ ఊహకందని అమౌంట్ ని డిమాండ్ చేస్తున్నట్లు వార్తలు ఉన్నాయి. బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ తో జవాన్ తో ఊహకందని బ్లాక్ బస్టర్ ని కొట్టిన అట్లీ తన తర్వాత మూవీ కోసం రెమ్యునరేషన్ పరంగా ఏకంగా 80 కోట్ల దాకా డిమాండ్ చేస్తున్నాడట….

అట్లీ ఎంత సక్సెస్ ఫుల్ నిర్మాత అయినా, కమర్షియల్ గా మూవీస్ ఎంత భారీ హిట్స్ అయినా కూడా 80 కోట్ల రెమ్యునరేషన్ డైరెక్టర్ కి హీరోకి 100 కోట్లకు పైగా రెమ్యునరేషన్ అలాగే ఇతర స్టార్ కాస్ట్ కి భారీ రెమ్యునరేషన్ లు వెళితే సినిమా నిర్మాణ వ్యయం హద్దులు దాటిపోతుందని అలా కాకుండా ప్రాఫిట్ షేర్స్ లో భాగం తీసుకోమని ఒప్పించడానికి…

నిర్మాతలు ట్రై చేసినా కూడా అట్లీ ఒప్పుకోకపోవడంతో నిర్మాతలు కొందరినీ అనుకున్నా కూడా అనుకున్న విధంగా చర్చలు జరగకపోవడంతో అందరూ వెనక్కి తగ్గినట్లు తెలుస్తుంది. దాంతో అల్లు అర్జున్ పుష్ప2 తర్వాత కొత్త సినిమా ఎవరితో అన్నది ప్రస్తుతానికి క్లారిటీ లేకుండా పోయింది….దీనిపై అఫీషియల్ గా అప్ డేట్ ఎప్పటి వరకు వస్తుందో చూడాలి ఇక…

Pushpa 11 Days Total Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here