బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా సంతోష్ శ్రీనివాస్ డైరెక్షన్ లో నబా నటేష్ మరియు అను ఎమాన్యుఎల్ ల కాంబినేషన్ లో రూపొందిన లేటెస్ట్ మూవీ అల్లుడు అదుర్స్… అందరికీ షాక్ ఇస్తూ సడెన్ గా సంక్రాంతి రేసు లో ఎంటర్ అయిన ఈ సినిమా టీసర్ లాంటివి ఏవి లేకుండానే డైరెక్ట్ గా థియేట్రికల్ ట్రైలర్ ను రీసెంట్ గా రిలీజ్ చేశారు. ట్రైలర్ చూసిన తర్వాత ఏంటి సామి ఇది అనిపించే విధంగా ఉంది ట్రైలర్…
ట్రైలర్ మొత్తం సంతోష్ శ్రీనివాస్ తీసిన కందిరీగ సినిమా ను అడుగడుగునా గుర్తు చేసిందని చెప్పొచ్చు. హీరో క్యారెక్టరైజేషన్ కంప్లీట్ గా కందిరీగ లో రామ్ ని పోలి ఉండగా విలన్ గా సోనూ సూద్ తన రోల్ ని తానె చేస్తున్నాడా అనిపించింది. ఇక హీరోయిన్స్ 2 ఉండటం…
హీరో ఇద్దరి వెంట పడటం లాంటివి కన్ఫ్యూజన్ ని క్రియేట్ చేయగా దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ లో 2 సాంగ్స్ ని ట్రైలర్ లో చూపెట్టారు… 2 కూడా జస్ట్ ఓకే అనిపించే విధంగా ఉన్నాయి. ఇక ట్రైలర్ లో బెల్లంకొండ శ్రీనివాస్ యాక్షన్ చూస్తుంటే ఇంకా ఇంప్రూవ్ అవ్వాల్సిన అవసరం…
ఎంతైనా ఉందనిపిస్తుంది. ఇక కాంచన మూవీస్ ని టచ్ చేస్తూ ట్రైలర్ లో చూపెట్టిన కొన్ని షాట్స్ ఏమంత ఇంప్రెసివ్ గా అనిపించలేదు… మొత్తం మీద ట్రైలర్ కి ముందు వరకు ఎంతో కొంత బజ్ ని సొంతం చేసుకున్న సినిమా కి ట్రైలర్ రిలీజ్ తర్వాత రొటీన్ కమర్షియల్ మూవీ చూడబోతున్నాం అనిపించే విధమైన ట్రైలర్ కట్ ఎలాంటి కొత్తదనం లేకుండా మెప్పించలేక పోయింది అని చెప్పాలి.
కానీ ఇలా రొటీన్ గా అనిపించిన ట్రైలర్ లు కొన్ని సార్లు సినిమా పరంగా మెప్పిస్తాయి కాబట్టి ఈ సారి కూడా అలా జరిగితే బాగుటుంది.. ప్రస్తుతానికి ట్రైలర్ వరకు అయితే పెద్దగా ఇంప్రెస్ చేయలేదు. మిగిలిన సంక్రాంతి మూవీస్ ట్రైలర్ లు టీసర్ లతో పోల్చితే వీక్ గా అనిపించింది. ఇక సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.