Home న్యూస్ హిట్టు కొట్టి 8 ఏళ్ళు…ఈ ట్రైలర్ కుమ్మింది….అల్లు శిరీష్ కి కంబ్యాక్!

హిట్టు కొట్టి 8 ఏళ్ళు…ఈ ట్రైలర్ కుమ్మింది….అల్లు శిరీష్ కి కంబ్యాక్!

0

మంచి స్టార్ బ్యాగ్రౌండ్ ఉన్న వాళ్ళు అందరికీ సక్సెస్ సొంతం అవ్వదు….ఈ కోవకే చెందుతాడు అల్లు వారబ్బాయి అల్లు శిరీష్(Allu Sirish)…ఒక పక్క అల్లు అర్జున్(Allu Arjun) టాప్ స్టార్స్ లో ఒకడిగా దుమ్ము లేపుతుంటే మరో పక్క ఒక మంచి హిట్ కోసం ఎప్పటి నుండో ఎదురు చూస్తూనే ఉన్న వాళ్ళలో ఒకరిగా నిలిచాడు అల్లు శిరీష్….

రెండేళ్ళ క్రితం ఊర్వశివో రాక్షసివో సినిమాతో హిట్ కొడతాడు అనుకున్నా ఆ సినిమా నిరాశ పరచగా చివరి సారిగా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అందుకుని ఆల్ మోస్ట్ 8 ఏళ్ళు అవుతుంది. 2016 టైంలో శ్రీరస్తూ శుభమస్తూ సినిమా హిట్ కొట్టగా తర్వాత చేసిన సినిమాలు ఏవి కూడా అంచనాలను అందుకోలేదు…

360 కోట్ల సీక్వెల్ ప్లేస్ లో…71 కోట్ల సీక్వెల్…ఇక్కడ కుమ్ముడే ఇక!
ఇక ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర తన కొత్త సినిమాతో తన లక్ ని మరోసారి పరీక్షించుకోబోతున్నాడు అల్లు శిరీష్. బడ్డీ అంటూ ఒక ఎక్స్ పెరిమెంటల్ సబ్జెక్ట్ తో ఆడియన్స్ ముందుకు జులై 26న రాబోతూ ఉండగా ఈ సినిమా అఫీషియల్ ట్రైలర్ ను రీసెంట్ గా రిలీజ్ చేశారు మేకర్స్….

ట్రైలర్ చూస్తుంటే ఆసక్తిగానే అనిపిస్తూ ఉండగా అల్లు శిరీష్ కి కంబ్యాక్ ఇచ్చే అవకాశం ఉంది అనిపించేలా ఉంది…. ప్రతీసారి మనుషులే రివేంజ్ తీర్చుకోవాలా టెడ్డీ బేర్ రివేంజ్ తీర్చుకోకూడదా అన్న కాన్సెప్ట్ తో ఒక ప్రాణం ఉన్న టెడ్డీ బేర్ కి హీరో హెల్ప్ చేస్తే ఎలా ఉంటుంది అన్న పాయింట్ తో…

కాజల్ “సత్యభామ” టోటల్ కలెక్షన్స్….హిట్టా-ఫట్టా!
వస్తున్న బడ్డీ మూవీ ట్రైలర్ ఆసక్తిగానే ఉండగా స్టార్ కాస్ట్ కూడా డీసెంట్ గా ఉండటంతో బాక్స్ ఆఫీస్ దగ్గర చిన్న పిల్లలను ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించే అవకాశం ఉంది అనిపించేలా ఆకట్టుకుంది. మరి సినిమా కూడా ట్రైలర్ లానే ఆకట్టుకునేలా ఉంటే అల్లు శిరీష్ కి డీసెంట్ కంబ్యాక్ గా సినిమా నిలిచే అవకాశం ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here