ఆల్ మోస్ట్ మూడేళ్ళ క్రితం ఫస్ట్ లుక్ రిలీజ్ అయిన చిన్న సినిమా అమరం అఖిలం ప్రేమ అనేక అవరోధాలను ఎదురుకుని థియేట్రికల్ రిలీజ్ కాకుండా నేడు డైరెక్ట్ గా ఆహా యాప్ లో రిలీజ్ అయ్యి ప్రేక్షకుల ముందుకు వచ్చింది, హార్ట్ టచింగ్ లవ్ స్టొరీ అంటూ చెప్పుకొచ్చిన ఈ సినిమా ప్రోమోలతో కొద్దిగా మెప్పించగా సినిమా ఎంతవరకు ఆడియన్స్ ని మెప్పించ గలిగిందో సింపుల్ గా తెలుసు కుందాం పదండీ..
కథ పాయింట్ విషయానికి వస్తే తండ్రి అంటే ఎంతో ప్రేమ ఉన్న కూతురు అనుకోకుండా చేసిన ఒక తప్పు వలన తండ్రి కూతుళ్ళ మధ్య గ్యాప్ రావడం, ఇదే టైం లో కూతురు ఐఏఎస్ కోచింగ్ కోసం హైదరాబాద్ రాగా హీరోతో పరిచయం ప్రేమగా మారిన తర్వాత…
వీళ్ళ లైఫ్ లో జరిగిన పరిణామాలు ఎలాంటివి, ప్రేమజంట ఏకం అయ్యారా లేదా, తండ్రి కూతుళ్ళ మధ్య గొడవ సద్దుమణిగిందా లేదా అనేది మాత్రం సినిమా చూసి తెలుసుకోవాల్సిందే…. పెర్ఫార్మెన్స్ పరంగా హీరో యావరేజ్ గా ఉన్న నటన పరంగా మెప్పించాడు. హీరోయిన్ మాత్రం అద్బుతంగా నటించి మెప్పించింది.
ఎమోషనల్ సీన్స్ ఇతర సీన్స్ అని తేడా లేకుండా తన నటన హైలెట్ అవ్వగా హీరోయిన్ ఫాదర్ రోల్ చేసిన శ్రీకాంత్ అయ్యంగర్ కూడా అద్బుతంగా నటించి మెప్పించగా మిగిలిన రోల్స్ చేసిన వాళ్ళు ఉన్నంతలో బాగానే ఆకట్టుకున్నారు. ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే చాలా స్లో గా ఉంటుంది… ముఖ్యంగా సినిమా టేక్ ఆఫ్ అవ్వడానికి చాలా టైం పట్టగా…
మెయిన్ లవ్ స్టొరీ సెట్ అవ్వడానికి ఇంటర్వెల్ అవుతుంది, కానీ సెకెండ్ ఆఫ్ కొంచం బెటర్ గా ఉండగా క్లైమాక్స్ చూసిన తర్వాత సెకెండ్ ఆఫ్ పర్వాలేదు అనిపిస్తుంది. సంగీతం ఫీల్ గుడ్ అనిపించే విధంగా ఉండగా బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమా ఫీల్ కి తగ్గట్లు ఉంది. సినిమాటోగ్రఫీ మెప్పించగా…
ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగానే ఉన్నాయి, మూడేళ్ళ క్రితం సినిమానే అయినా క్వాలిటీ బాగానే ఉంది. ఇక డైరెక్షన్ పరంగా జోనాథన్ వెసపోగు పరమ రొటీన్ కథని ఎంచుకుని ఫీల్ గుడ్ టచ్ ఇచ్చి డైలాగ్స్ తో కొన్ని సీన్స్ తో మెప్పించాడు కానీ ఓవరాల్ మూవీ మాత్రం నీరసంగా ఉంటుంది.
కొన్ని సీన్స్ మెప్పించినా ఓవరాల్ సినిమా చూసుకుంటే చాలా స్లో నరేషన్, వీక్ స్క్రీన్ ప్లే అండ్ ఎడిటింగ్, టేక్ ఆఫ్ కి టైం పట్టడం, మేలో డ్రామా మరీ ఎక్కువ అవ్వడం లాంటివి కచ్చితంగా ఇబ్బంది పెట్టె అంశాలే అని చెప్పాలి. అయినా కానీ ఇవన్ని బరించి కొన్ని సీన్స్ తో సినిమా పర్వాలేదు అనిపించే విధంగా ఉంటుంది..
క్లాస్ మూవీస్ చూసే వాళ్లకి, స్లో మూవీస్ ఇష్టపడే వారికి, హార్ట్ టచింగ్ లవ్ స్టోరీస్ చూసే వాళ్లకి సినిమా కొద్ది వరకు మెప్పించే అవకాశం ఉంటుంది, రెగ్యులర్ మూవీస్ చూసే వాళ్లకి సినిమా కొన్ని సీన్స్ మెప్పించినా ఓవరాల్ గా బోర్ కొట్టడం ఖాయం. ఓవరాల్ గా సినిమా కి మా రేటింగ్ 2.25 స్టార్స్…