బాక్స్ ఆఫీస్ దగ్గర దీపావళి వీకెండ్ లో భారీ లెవల్ లో ఆడియన్స్ ముందుకు వస్తున్న మూవీస్ లో శివ కార్తికేయన్(Siva Kartikeyan) సాయి పల్లవి(Sai Pallavi) ల కాంబోలో తెరకెక్కిన అమరన్(Amaran Movie) శివ కార్తికేయన్ కెరీర్ లో రీసెంట్ టైంలో భారీ హైప్ తో వస్తున్న సినిమాగా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా మీద…
తమిళనాడులో హైప్ మరో లెవల్ లో ఉండగా శివ కార్తికేయన్ కెరీర్ లోనే సెన్సేషనల్ బుకింగ్స్ తో మాస్ రచ్చ చేస్తూ ఉండగా తెలుగు రాష్ట్రాలలో సైతం బుకింగ్స్ రచ్చ ఇతర స్ట్రైట్ మూవీస్ తో పోల్చితే మంచి ట్రెండ్ ను చూపెడుతూ ఉండగా ఓవరాల్ గా..
టోటల్ దీపావళి మూవీస్ లో సాలిడ్ ట్రెండ్ ను చూపెడుతూ ఉండటం విశేషం అని చెప్పాలి. సినిమా తమిళనాడులో ఇప్పటి వరకు జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ అక్కడ మీడియం రేంజ్ హీరోలలో పరంగా వన్ ఆఫ్ ది హైయెస్ట్ ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం ఎంతైనా ఉంది. అలాగే దీపావళి మూవీస్ అన్నీ కలిపినా అమరన్ బుకింగ్స్ రేంజ్ ని టచ్ కూడా చేయలేక పోతున్నాయి…
ఈ ట్రెండ్ కి తగ్గట్లు టాక్ కూడా బాగుంటే సినిమా మొదటి రోజు లెక్క అంచనాలను అన్నీ మించి పోవడం ఖాయమని చెప్పాలి. ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి సినిమా తమిళనాడులో 12-14 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా తెలుగు రాష్ట్రాల్లో సినిమా…
2.5-3 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక సినిమా రెస్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఓవర్సీస్ లో కూడా సాలిడ్ ట్రెండ్ ను చూపెడుతూ ఉండటంతో శివ కార్తికేయన్ కెరీర్ లోనే ఆల్ టైం బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ను సాధించే ఛాన్స్ ఉంది…
ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి సినిమా ఓవరాల్ గా 25-28 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ను అందుకునే ఛాన్స్ ఉండగా ఫైనల్ లెక్కలు బాగుంటే 30 కోట్ల మార్క్ ని కూడా మించే అవకాశం కనిపిస్తుంది. టాక్ బాగుంటే సినిమా సాలిడ్ కలెక్షన్స్ తో కుమ్మేసే అవకాశం ఎంతైనా ఉంది.