Home న్యూస్ అంబాజీపేట మ్యారేజి బ్యాండు రివ్యూ….ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!

అంబాజీపేట మ్యారేజి బ్యాండు రివ్యూ….ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!

0

చిన్న చిన్న రోల్స్ నుండి ఇప్పుడు మెయిన్  లీడ్ రోల్స్ వరకు ఎదిగి డిఫెరెంట్ సినిమాలతో ఆకట్టుకుంటున్న యంగ్ హీరో సుహాస్(Suhas) లాస్ట్ ఇయర్ రైటర్ పద్మభూషణ్ తో మంచి విజయాన్ని అందుకున్న తర్వాత ఇప్పుడు ఆడియన్స్ ముందుకు తన లేటెస్ట్ మూవీ అంబాజీపేట మ్యారేజి బ్యాండు(Ambajipeta Marriage Band Movie) సినిమాతో వచ్చేశాడు, మరి ఈ సినిమా ఎలా ఉంది ఎంతవరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం పదండీ…

ముందుగా కథ పాయింట్ కి వస్తే 2007 టైంలో అంబాజీపేట ఊర్లో ఉండే హీరో మ్యారేజ్ బ్యాండ్ లో పని చేస్తూ ఉండగా హీరో అక్క స్కూల్లో టీచర్ గా పని చేస్తుంది… ఊర్లో వడ్డీ వ్యాపారం చేసే విలన్ హీరో అక్క మీద కన్నేస్తాడు….హీరో విలన్ చెల్లెలిని ఇష్టపడగా ఇద్దరూ ప్రేమలో పడతారు… ఆ తర్వాత కథ ఏమయింది ఎటు టర్న్ తీసుకున్నది అన్నది అసలు కథ…

పెర్ఫార్మెన్స్ పరంగా సుహాస్ తన సహజ నటనతో ఆకట్టుకోగా కొన్ని చోట్ల తన పెర్ఫార్మెన్స్ బాగా మెప్పించింది… ఇక హీరోకి ఏమాత్రం తీసిపోని విధంగా హీరో అక్క రోల్ లో శరణ్య చాలా బాగా మెప్పించింది. హిరోయిన్ పర్వాలేదు అనిపించగా విలన్ రోల్ కూడా ఆకట్టుకుంది. ఇతర యాక్టర్స్ ఉన్నంతలో పర్వాలేదు అనేలా నటించి మెప్పించారు…

సంగీతం సినిమా ఫీల్ కి తగ్గట్లు మెప్పించాగా బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా సినిమా ఫీల్ కి తగ్గట్లు ఆకట్టుకుంది… ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఫస్టాఫ్ పర్వాలేదు పర్వాలేదు అనిపించేలా ఉండగా సెకెండ్ ఆఫ్ లో కొంచం ప్రిడిక్టబుల్ గా ఉన్నప్పటికీ పర్వాలేదు అనిపించేలా ఆకట్టుకుంది… సినిమాటోగ్రఫీ బాగుండగా సినిమాలో కొన్ని డైలాగ్స్ చాలా బాగా రాశాడు…. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఉన్నంతలో బాగానే మెప్పించాయి.

డైరెక్షన్ విషయానికి వస్తే ఎంచుకున్న పాయింట్ కొంచం రొటీన్ గానే ఉన్నా కూడా ఫస్టాఫ్ ఎంటర్ టైన్ మెంట్ బాగుండటం, ఇంటర్వెల్ పాయింట్ తో సెకెండ్ ఆఫ్ పై అంచనాలు పెరగగా సెకెండ్ ఆఫ్ కథ కొంచం డిఫెరెంట్ గా ఉన్నప్పటికీ కొన్ని చోట్ల ఓవర్ గా డ్రాగ్ అవ్వడం ఆడియన్స్ ఈజీగా గెస్ చేసేలా చాలా వరకు సీన్స్ ఉండటం పడుతూ లేస్తూ సాగిన కథ…

ఎండ్ అవ్వడం మాత్రం బాగా ఎండ్ అయ్యి ఓవరాల్ సినిమా చూసిన ఆడియన్స్ ను ఓ మంచి సినిమా చూసిన ఫీలింగ్ తో బయటికి వచ్చేలా చేస్తుంది, డైరెక్టర్ ఆ విషయంలో చాలా వరకు సక్సెస్ అయ్యాడు అని చెప్పాలి. కుల వివక్ష గురించి ఆల్ రెడీ ఎన్నో సినిమాలు వచ్చినా కూడా అంబాజీపేట మ్యారేజి బ్యాండు కూడా తన మార్క్ ని చూపించేలా…

చాలా సీన్స్ మెప్పించడంతో అప్ అండ్ డౌన్స్ సినిమాలో ఉన్నా కూడా ఓవరాల్ గా ముందే చెప్పినట్లు సినిమా అయ్యే టైంకి ఓ మంచి సినిమా చూసిన ఫీలింగ్ తోనే బయటికి వచ్చేలా చేస్తుంది…. కథ ఒక్కటి కొంచం ప్రిడిక్టబుల్ గా ఉండటం కొంచం మైనస్ అయినా కూడా ఈజీగా ఒకసారి సినిమాను చూడొచ్చు… మొత్తం మీద సినిమాకి మా రేటింగ్ 2.75 స్టార్స్…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here