యంగ్ హీరో రాజ్ తరుణ్ బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ కొట్టి చాలా ఏళ్ళు అవుతుంది, హాట్రిక్ విజయాలతో కెరీర్ ని మొదలు పెట్టినా కానీ మద్యలో వరుస ఫ్లాఫ్స్ తో ట్రాక్ తప్పిన రాజ్ తరుణ్ మొదట్లో వచ్చిన హిట్ మూవీస్ తో దక్కిన మార్కెట్ ని మెల్లిమెల్లిగా కోల్పోతూ ఇప్పుడు కంప్లీట్ గా ట్రాక్ తప్పి బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాగైనా హిట్ కొట్టాల్సిన అవసరంతో బరిలోకి దిగుతున్నారు.
రాజ్ తరుణ్ నటించిన లేటెస్ట్ మూవీ అనుభవించు రాజా సినిమా ట్రైలర్ తోనే కొంచం ప్రామిసింగ్ గా అనిపించగా కామెడీ కూడా సినిమాలో మెప్పించేలా ఉందనిపించింది… దాంతో ట్రైలర్ కి ఆడియన్స్ నుండి ఉన్నంతలో డీసెంట్ రెస్పాన్స్ సొంతం అయ్యింది అని చెప్పాలి. ఇక సినిమా మరి కొన్ని…
గంటల్లో ఆడియన్స్ ముందుకు రాబోతుండగా తెలుగు రాష్ట్రాలలో మంచి థియేటర్స్ కౌంట్ నే దక్కించుకుంది. నైజాం లో సినిమా 160 వరకు థియేటర్స్ లో రిలీజ్ కాబోతుండగా సీడెడ్ ఏరియాలో 85 వరకు థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఇక టోటల్ ఆంధ్రలో 200 వరకు థియేటర్స్ లో రిలీజ్ కానుండగా… టోటల్ గా తెలుగు రాష్ట్రాలలో…
సినిమా ఇప్పుడు 450 వరకు థియేటర్స్ లో రిలీజ్ ను సొంతం చేసుకునే అవకాశం ఉండగా టోటల్ వరల్డ్ వైడ్ గా 600 వరకు థియేటర్స్ లో రిలీజ్ కానుండగా సినిమా బిజినెస్ వివరాలు అఫీషియల్ గా అయితే అనౌన్స్ చేయలేదు కానీ ట్రేడ్ లో వినిపిస్తున్న లెక్కల ప్రకారం తెలుగు రాష్ట్రాలలో 3.2 కోట్ల రేంజ్ బిజినెస్ ను వరల్డ్ వైడ్ గా 3.5 కోట్లకు వరకు బిజినెస్ ను…
అందుకుందని అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అవ్వాలి అంటే 4 కోట్ల లోపు షేర్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా అందుకుంటే క్లీన్ హిట్ గా నిలిచే అవకాశం ఉంటుంది, బిజినెస్ లో ఇంకా ఏమైనా మార్పులు ఉంటే అఫీషియల్ గా అప్ డేట్ చేసిన తర్వాత మళ్ళీ అప్ డేట్ చేస్తాం. ఈ సినిమా తో అయినా రాజ్ తరుణ్ హిట్ గీత దాటుతాడో లేదో చూడాలి.