Home న్యూస్ టాక్ తేడాగా ఉన్నా…వీకెండ్ లో అల్లరోడి రచ్చ…ఇది చూసుకుని ఉంటే బాగుండేది!

టాక్ తేడాగా ఉన్నా…వీకెండ్ లో అల్లరోడి రచ్చ…ఇది చూసుకుని ఉంటే బాగుండేది!

1

బాక్స్ ఆఫీస్ దగ్గర సమ్మర్ రేసులో నిలిచిన సినిమాల్లో అల్లరి నరేష్(Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ ఆ ఒక్కటీ అడక్కు(Aa Okkati Adakku Movie) కూడా ఒకటి…చాలా టైంలో మంచి కామెడీ ఎంటర్ టైనర్ చేయని అల్లరి నరేష్ ఈ సినిమాతో ఆడియన్స్ ను అలరించడానికి వచ్చింది కానీ మరీ రొటీన్ స్టఫ్ ఉండటంతో…

సినిమాకి ఆడియన్స్ నుండి మిక్సుడ్ రెస్పాన్స్ సొంతం అయ్యింది, కానీ వీకెండ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన మూవీస్ లో టాక్ బాగున్న సినిమాల కన్నా కూడా ఆ ఒక్కటీ అడక్కు సినిమా మంచి జోరునే చూపించి వీకెండ్ లో డీసెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది…. ఆడియన్స్ మండుటెండలో కూడా…

మిక్సుడ్ టాక్ ఉన్న కామెడీ మూవీ ని చూడటానికి థియేటర్స్ లోకి రావడం విశేషం అనే చెప్పాలి. అదే టైంలో టీం సినిమా మీద మరింత శ్రద్ధ తీసుకుని డీసెంట్ ఔట్ పుట్ కనుక ఇచ్చి ఉంటే బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా జోరు ఇంకా బెటర్ గా ఉండేదని చెప్పొచ్చు….అల్లరి నరేష్ లాస్ట్ సినిమాలు సీరియస్ జానర్ లో ఉండగా…

వాటితో పోల్చితే టాక్ కొంచం వీక్ గానే ఉన్న ఆ ఒక్కటీ అడక్కు సినిమా వసూళ్లు బెటర్ గానే ఉండటంతో ఇప్పటికీ జనాలు అల్లరోడి కామెడీ ఎంటర్ టైనర్స్ చూడటానికి సిద్ధంగా ఉన్నారని చెప్పొచ్చు. ఇక అల్లరి నరేష్ అప్ కమింగ్ మూవీస్ ని మరింత ఎంటర్ టైనింగ్ గా డీసెంట్ కథతో వస్తే ఇంకా బెటర్ రిజల్ట్ లను సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది.

1 COMMENT

Leave a Reply to Nani Cancel reply

Please enter your comment!
Please enter your name here