Home న్యూస్ కల్కి AP-TG 2 డేస్ కలెక్షన్స్….రెండో రోజు అంచనాలు మించిన భీభత్సం!

కల్కి AP-TG 2 డేస్ కలెక్షన్స్….రెండో రోజు అంచనాలు మించిన భీభత్సం!

0

మొదటి రోజు అద్బుతమైన స్టార్ట్ ను సొంతం చేసుకున్నా కూడా ఓవరాల్ గా రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ కల్కి 2898AD(Kalki2898AD Movie) అంచనాలను అయితే పూర్తిగా మించిపోలేక పోయింది. దాంతో రెండో రోజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి హోల్డ్ ని చూపెడుతుంది అన్నది ఆసక్తిగా మారగా రెండో రోజు వర్కింగ్ డే నే అయినా కూడా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…

అంచనాలను మించిపోయే రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపింది ఇప్పుడు….రెండో రోజు ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి సినిమా 16-18 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు, ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అంచనాలను మించి పొతే ఈ లెక్క ఇంకా పెరగవచ్చు అనుకోగా సినిమా అనుకున్నట్లే అంచనాలను మించి పోయి రెండో రోజు…

ఆల్ మోస్ట్ 20 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని ఎక్స్ లెంట్ గా హోల్డ్ ని చూపించింది…..ఆల్ మోస్ట్ 31 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకుని దుమ్ము లేపింది ఇప్పుడు. దాంతో రెండో రోజు అంచనాలను మించి పోయే కలెక్షన్స్ తో రచ్చ లేపిన సినిమా వీకెండ్ మొత్తం కుమ్మేయడం ఖాయంగా కనిపిస్తూ ఉండగా రెండో రోజు

సినిమా తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
#Kalki2898AD Day 2 AP TG Collections(Inc GST)
👉Nizam: 10.53Cr
👉Ceeded: 2.30CR
👉UA: 2.27Cr
👉East: 1.19Cr
👉West: 77L
👉Guntur: 1.14Cr
👉Krishna: 1.18Cr
👉Nellore: 62L
AP-TG Total:- 20.00CR(31.35CR~ Gross)

ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ గా 2 రోజుల్లో సినిమా 64.86 కోట్ల రేంజ్ లో షేర్ 100 కోట్ల రేంజ్ కి పైగా గ్రాస్ ను అందుకోగా తెలుగు రాష్ట్రాల వాల్యూ బిజినెస్ 168 కోట్ల దాకా ఉండగా వీకెండ్ లోనే చాలా మొత్తాన్ని సినిమా రికవరీ చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు. ఇక లాంగ్ రన్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here