Home గాసిప్స్ 18.5 కోట్ల సినిమా…10 కోట్ల ఆఫర్ నుండి కొత్త ఆఫర్ దారుణంగా పడిపోయిందిగా!!

18.5 కోట్ల సినిమా…10 కోట్ల ఆఫర్ నుండి కొత్త ఆఫర్ దారుణంగా పడిపోయిందిగా!!

0

ఛాన్స్ వచ్చినప్పుడే ఏదైనా మంచి నిర్ణయం తీసుకోవాలి అంటారు. లాస్ట్ ఇయరే జరిగింది ఇప్పుడు మళ్ళీ జరుగుతుంది. యాక్షన్ హీరో గోపీచంద్ నటించిన సినిమాల్లో రిలీజ్ కి నోచుకోలేక పోతున్న సినిమా ఆరడుగుల బుల్లెట్. ఎప్పుడో 2015 టైం లోనే మొదలు అయ్యి 2017 టైం లో ఆడియన్స్ ముందుకు రావాల్సిన ఈ సినిమా అప్పటి నుండి కూడా అనుకోని ఫైనాన్స్ ఇబ్బందుల వలన అలాగే ఇతర కారణాల వలన రిలీజ్ కి నోచుకోలేక పోతుంది.

చాలా సార్లు ఆల్ మోస్ట్ రిలీజ్ ను కన్ఫాం చేసుకున్నా కానీ లాస్ట్ మినట్ లో ఎదో ఒక ఎదురు దెబ్బ పడటం సినిమా రిలీజ్ ఆగిపోవడం జరుగుతూ రాగా సినిమా లాస్ట్ ఇయర్ ఫస్ట్ వేవ్ టైం లో డిజిటల్ రిలీజ్ చేయించాలని నిర్మాత ట్రై చేయగా పర్వాలేదు…

అనిపించే ఆఫర్స్ దక్కాయి కానీ ఎందుకనో డీల్ క్లోజ్ చేయక పోవడం తో రేటు తగ్గి తగ్గి ఆఫర్ ని కూడా వెనక్కి తీసుకున్నాయి OTT కంపెనీలు. మళ్ళీ ఇప్పుడు సెకెండ్ వేవ్ టైం లో ఈ సినిమా కి 8-10 కోట్ల రేంజ్ లో డిజిటల్ రిలీజ్ ఆఫర్స్ దక్కాయి.

సినిమా బడ్జెట్ 15 కోట్లతో తీసినా అప్పులు వడ్డీలు కలిపి 18.5 కోట్ల రేటు అయింది, ఆ బడ్జెట్ తో పోల్చితే డిజిటల్ రైట్స్ డీసెంట్ గానే వచ్చాయి కానీ మళ్ళీ ఎందుకనో లేట్ చేశారు. దాంతో ఇప్పుడు రేటు చాలా తగ్గించేశారు OTT వాళ్ళు. ఇప్పుడు సినిమా కి మేం 6 కోట్ల రేంజ్ లోనే రేటు ఇవ్వగలమని, దానికి ఓకే అంటే డీల్ క్లోజ్ చేద్దామని…

అంటున్నారట. దాంతో మేకర్స్ మళ్ళీ ఏమి చేయలేని పరిస్థితి ఏర్పడింది అంటున్నారు ఇప్పుడు. మొత్తం మీద ఆలస్యం అవుతున్న కొద్ది రేటు ఇంకా తగ్గుతుందని తెలిసినా ఈ సారి మరింత ఆలస్యం చేయడం వలన ఇప్పుడు సినిమా పరిస్థితి మళ్ళీ మొదటికి చేరింది. మరి మేకర్స్ ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి ఇక..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here