Home గాసిప్స్ ధనుష్ తెలుగు మూవీ…..రికార్డ్ రెమ్యునరేషన్!!

ధనుష్ తెలుగు మూవీ…..రికార్డ్ రెమ్యునరేషన్!!

0

కోలివుడ్ స్టార్ హీరోలు అందరూ కూడా మొదటి నుండి టాలీవుడ్ ఇండస్ట్రీ పై ఒక కన్ను వేసి ఉన్నారు. కానీ ఎవ్వరూ కూడా ఇప్పటి వరకు తెలుగు లో డైరెక్ట్ మూవీ కి ఓకే చెప్పలేదు. కార్తీ ఒక్కడు ఊపిరి సినిమా తీశాడు కానీ తమిళ్ స్టార్ హీరోలు ఎవ్వరూ కూడా డైరెక్ట్ మూవీ కి ఇన్నాళ్ళు నో చెబుతూ వచ్చారు కానీ మన మార్కెట్ వాల్యూ వాళ్ళకి కూడా తెలుసు కాబట్టి…

ఇప్పుడు రూట్ మార్చి డైరెక్ట్ తెలుగు మూవీ కి సై అంటున్నారు. కోలివుడ్ టాప్ హీరో విజయ్ తెలుగు లో వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో సినిమా కి చెప్పగా సూర్య కూడా తెలుగు డైరెక్టర్స్ కథలను వింటున్నాడు. ఇక రీసెంట్ గా వీళ్ళ కన్నా ముందు…

అఫీషియల్ గా ధనుష్ డైరెక్ట్ తెలుగు మూవీ ని కన్ఫాం చేశాడు. తెలుగులో చేసింది కొన్ని సినిమాలే అయినా సెన్సిబుల్ డైరెక్టర్ గా మంచి పేరున్న క్లాస్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో తెలుగు తమిళ్ మరియు హిందీ లో కొత్త సినిమాను రీసెంట్ గా అనౌన్స్ చేశారు.

ఇక ఈ సినిమా తో తొలిసారిగా శేఖర్ కమ్ముల స్టార్ హీరోతో పని చేస్తూ ఉండగా తొలిసారి ధనుష్ టాలీవుడ్ లో అడుగు పెడుతున్నందున భారీ రెమ్యునరేషన్ ని తీసుకోబోతున్నట్లు సమాచారం. ఒక్కో తమిళ్ మూవీ కి ధనుష్ రెమ్యునరేషన్ అండ్ ప్రాఫిట్ షేర్ కింద 25 కోట్ల దాకా తీసుకుంటారని కోలివుడ్ లో టాక్ ఉంది. ఇప్పుడు ఇది మల్టీ లాంగ్వేజ్ మూవీ…

అవ్వడం తో సినిమా కి మొత్తం మీద 50 కోట్ల భారీ రెమ్యునరేషన్ ని ధనుష్ తీసుకోబోతున్నట్లు సమాచారం. ఇది ధనుష్ కెరీర్ లోనే ఆల్ టైం హైయెస్ట్ రెమ్యునరేషన్ గా చెబుతున్నారు. మూడు భాషల్లో సినిమా తీస్తారు కాబట్టి అన్ని చోట్ల మార్కెట్ ఉంటుంది కాబట్టి ఈ రేటు సమంజసమే అంటున్నారు విశ్లేషకులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here