Home న్యూస్ 18.5 పెడితే…5…వాటికి కూడా నో చెప్పిన నిర్మాత…రీజన్ ఇదే!!

18.5 పెడితే…5…వాటికి కూడా నో చెప్పిన నిర్మాత…రీజన్ ఇదే!!

0

ఒకప్పుడు వరుస మాస్ హిట్స్ తో మాస్ లో మంచి క్రేజ్ ని సొంతం చేసుకుని తన కంటూ ఒక మాస్ మార్కెట్ ని సొంతం చేసుకున్న యాక్షన్ హీరో గోపీచంద్ కెరీర్ లో వరుస పెట్టి ఎదురు అవుతున్న ఫ్లాఫ్స్ వలన తన మార్కెట్ ని చాలా వరకు కోల్పోవాల్సి వచ్చింది. ఈ ఎఫెక్ట్ వలన అలాగే ఒక సినిమా ఫైనాన్స్ ఇబ్బందుల వలన ఆల్ మోస్ట్ 4 ఏళ్ళుగా రిలీజ్ కి నోచుకోకుండా…

అలానే లాబ్స్ లో ఉంటూనే వస్తుంది, ఆ సినిమానే గోపీచంద్ నయనతారల కాంబినేషన్ లో బి గోపాల్ డైరెక్షన్ లో రూపొందిన ఆరడుగుల బుల్లెట్ సినిమా, ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా ఫైనాన్స్ ఇబ్బందుల వలన ఇతర కారణాల వలన ఎప్పటికప్పుడు రిలీజ్ కి…

ఎదురుదెబ్బలు తగలడం తో ఆడియన్స్ ముందుకు రాలేక పోతుంది, లాస్ట్ ఇయర్ నుండి డిజిటల్ రిలీజ్ కి ట్రై చేసినా రేటు ఎటూ ఫైనల్ అవ్వక పోవడం తో రిలీజ్ ఆగిపోతూ వస్తుంది. ఫైనాన్స్ అప్పులతో కలిపి నిర్మాత ఈ సినిమా కోసం 18.5 కోట్లు ఖర్చు చేశారు, ఇక సినిమా డిజిటల్ రేటు ఆఫర్స్…

ఒక దశలో 10 కోట్ల దాకా వెళ్ళినా మేకర్స్ ఇంకా బెటర్ ఆఫర్ కోసం చూడగా తర్వాత రేటు తగ్గుతూ తగ్గుతూ ఇప్పుడు 5-6 కోట్ల రేంజ్ కే చేరుకోగా ఇక నిర్మాత మనసు మార్చుకుని ఇప్పుడు థియేటర్స్ రీ ఓపెన్ అయ్యాక సినిమాను థియేటర్స్ లో ఎంతోకొంత రేటుకి అమ్మాలని ఫిక్స్ అయ్యి బిజినెస్ ఓపెన్ చేయగా మొత్తం మీద సినిమా బిజినెస్ 4.5-5 కోట్ల రేంజ్ లో…

ఆఫర్స్ రావడం తో ఇవి కూడా అంతంత మాత్రమే ఉండటంతో ఇక ఆ బిజినెస్ కూడా అవసరం లేదని, సినిమా కి ఎంత వస్తే అంతే నని తానె స్వయంగా రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమాను రిలీజ్ చేయాలనీ డిసైడ్ అయ్యాడట నిర్మాత, త్వరలోనే సినిమా ఆడియన్స్ ముందుకు రాబోతుందని అంటున్నారు. వచ్చిన రేటుని కూడా పక్కకు పెట్టి డైరెక్ట్ రిలీజ్ చేయబోతున్నాడు నిర్మాత. మరి సినిమా ఎలాంటి రిజల్ట్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here