Home టోటల్ కలెక్షన్స్ అక్షరాలా 100 కోట్లు…6నెలల్లో ఒకే ఒక్క సినిమా ఇదే!

అక్షరాలా 100 కోట్లు…6నెలల్లో ఒకే ఒక్క సినిమా ఇదే!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇయర్ కోలివుడ్ నుండి అనుకున్న రేంజ్ లో సినిమాలు ఏమి రాలేదు….ఇతర ఇండస్ట్రీలు మంచి జోరునే మొదట్లో చూపించగా తర్వాత అన్నీ స్లో అయినా కూడా కోలివుడ్ మాత్రం ఇయర్ స్టార్టింగ్ నుండే పెద్దగా జోరు చూపించలేదు. ఇలాంటి టైంలో సమ్మర్ రేసులో నిలిచిన అరణ్మనై4(Aranmanai4 Movie) లాంటి హర్రర్ కామెడీ మూవీ….

రిలీజ్ అవ్వగా సినిమాకి మిక్సుడ్ రెస్పాన్స్ ఆడియన్స్ నుండి వచ్చినా కూడా ఎక్కడో తమిళ్ ఆడియన్స్ ఈ సినిమాకి కనెక్ట్ అవ్వడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమాను చూడటానికి ఎగబడ్డారు… దాంతో సెన్సేషనల్ కలెక్షన్స్ ని లాంగ్ రన్ లో సొంతం చేసుకుని సంచలన విజయాన్ని నమోదు చేసింది. సినిమా తెలుగు లో మొత్తం మీద…

రన్ కంప్లీట్ అయ్యే టైంకి 5.60 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకున్న సినిమా 2.55 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా సినిమా 2.75 కోట్ల రేంజ్ లో టార్గెట్ ను అందుకోవాల్సి ఉండగా ఆల్ మోస్ట్ బిజినెస్ ను రికవరీని చేయగా సెమీ హిట్ రేంజ్ లో ఇక్కడ కూడా పర్వాలేదు అనిపించుకున్న సినిమా టోటల్ రన్ లో…

సాధించిన కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే….
Aranmani4(Baak)Movie Total World Wide Collections
👉Tamilnadu – 67.40Cr
👉Telugu States- 5.60Cr
👉Ka+ROI – 7.95Cr
👉Overseas – 19.65Cr***(Updated)
Total WW collection –100.60CR(47.50CR~ Share) Approx

టోటల్ రన్ లో అక్షరాలా 100 కోట్ల మార్క్ ని దాటేసిన సినిమా ఈ ఏడాది తమిళ్ ఇండస్ట్రీ తరుపున మొట్ట మొదటి 100 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకోవడం విశేషం. సినిమా స్టడీగా సమ్మర్ లో లాంగ్ రన్ ని దక్కించుకుని దుమ్ము లేపి భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. టోటల్ రన్ లో 18 కోట్ల బిజినెస్ మీద ఊహకందని లాభాలను అందుకుని సంచలన బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here