యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో వచ్చిన అరవింద సమేత బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారం పది రోజుల హిస్టారికల్ కలెక్షన్స్ తో బ్రేక్ ఈవెన్ అవ్వ గా పండగ సెలవుల తర్వాత వర్కింగ్ డేస్ లో మాత్రం స్లో అవ్వక తప్ప లేదు. భారీ గా సెలవుల తర్వాత ఏ మూవీ అయినా స్లో అవుతుంది కానీ ఈ సినిమా కొంచం ఎక్కువ స్లో అయింది.
దానికి 2 వ వారం వర్కింగ్ డేస్ లో కూడా టికెట్ రేట్లు భారీగా పెంచి ఉంచడం ఒక కారణం అని అంటున్నారు… కానీ కారణాలు ఏవి అయినా సినిమా మాత్రం కొంచం స్లో అయింది. దాంతో అనుకున్న రేంజ్ లో కాకున్నా రెండు వారాల్లో 95 కోట్ల షేర్ ని అందుకున్న ఈ సినిమా ఇప్పుడు 15 వ రోజు ఓపెనింగ్స్ పరంగా పెద్ద గా జోరు చూపలేదు.
వర్కింగ్ డే నే అవ్వడంతో సినిమా ఓవరాల్ గా ఆక్యుపెన్సీ ని చూసుకుంటే రోజు మొత్తం సుమారు 10% వరకు మాత్రమే సొంతం చేసుకుంది. దాంతో 15 వ రోజు ఈ సినిమా రెండు రాష్ట్రాలలో 25 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే ఛాన్స్ ఉందని అంటున్నారు. శుక్రవారం నుండి మళ్ళీ పుంజుకునే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు.
ఇక రామ్ నటించిన హెలొ గురు ప్రేమ కోసమే మొదటి వారం 17.6 కోట్ల షేర్ ని అందుకోగా రెండో వారం మొదటి రోజు ఓవరాల్ గా 20% వరకు ఆక్యుపెన్సీ ని సొంతం చేసుకుంది. దాంతో సినిమా 8 వ రోజు రెండు రాష్ట్రాలలో 50 లక్షల లోపు వసూళ్లు సాధించవచ్చని సమాచారం.
ఇక పందెం కోడి 2 మొదటి వారం 6.1 కోట్ల షేర్ తర్వాత 8 వ రోజు అన్నీ ఏరియాల్లో స్లో డౌన్ అయింది. టోటల్ ఆక్యుపెన్సీ 5% కూడా లేదు… దాంతో ఈ రోజు ఈ సినిమా మొత్తం మీద 10 లక్షల లోపు షేర్ ని అందుకునే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. మొత్తం మీద మూడు సినిమాలు గురువారం రోజున మరింత స్లో డౌన్ అయ్యాయి. ఇక వీకెండ్ లో ఎలా పెర్ఫార్మ్ చేస్తాయో చూడాలి.