జస్ట్ ఒక కోటి కొడితే టాప్ 3

0
934

  బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో వారం వర్కింగ్ డేస్ నుండి స్లో డౌన్ అయిన అరవింద సమేత మొత్తం మీద 2 వారాలు ముగిసే సమయాని కి సేఫ్ జోన్ లో ఉన్నా కొన్ని ఏరియాల్లో ఇంకా కొంచం కష్ట పడాల్సి ఉంది. కాగా మిగిలిన ఏరియాల లో ఎలా ఉన్నా రాయలసీమ లో మాత్రం సినిమా మొదటి రోజు నుండే ఆల్ టైం రికార్డులు నమోదు చేసిన విషయం అందరి కీ తెలిసిందే.

కాగా సినిమా రెండు వారాలలో అక్కడ మొత్తం మీద 16.8 కోట్ల షేర్ ని అందుకోగా బాక్స్ ఆఫీస్ దగ్గర మిగిలిన రన్ లో మరో కోటి వసూల్ చేయగలిగితే ఆల్ టైం టాప్ 3 బిగ్గెస్ట్ షేర్ వసూల్ చేసిన మూవీ గా రికార్డ్ కొట్టే అవకాశం ఉందని చెప్పొచ్చు.

 బాహుబలి సిరీస్ ని పక్కన పెడితే అక్కడ రంగస్థలం టోటల్ రన్ లో 17.7 కోట్ల షేర్ తో ఆల్ టైం నాన్ బాహుబలి ఇండస్ట్రీ రికార్డ్ కొట్టింది. ఆ రికార్డ్ కి ఇప్పుడు అతి చేరువగా ఉన్న అరవింద సమేత లాంగ్ రన్ లో ఈ రికార్డ్ కొట్టే అవకాశం అయితే ఉందని అంటున్నారు. మరి ఎం జరుగుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!