Home న్యూస్ ఇండస్ట్రీ హిట్ మూవీ…ఇక్కడ బుకింగ్స్ చూసి మైండ్ బ్లాంక్!!

ఇండస్ట్రీ హిట్ మూవీ…ఇక్కడ బుకింగ్స్ చూసి మైండ్ బ్లాంక్!!

0

టాలీవుడ్ లో నాన్ బాహుబలి మూవీస్ లో ఆల్ టైం రికార్డులను నమోదు చేసిన సినిమా అల వైకుంఠ పురంలో, అల్లు అర్జున్ త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహకందని కలెక్షన్స్ ని సొంతం చేసుకుని ఆల్ టైం నాన్ SSR ఇండస్ట్రీ హిట్ మూవీ గా నిలిచి సంచలనం సృష్టించింది. అలాంటి సినిమా హిందీ రీమేక్ వర్షన్ శెహ్ జాదా సినిమా….

ఆడియన్స్ ముందుకు ఈ శుక్రవారం భారీ ఎత్తున రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా ముందుగానే రిలీజ్ అవ్వాల్సింది కానీ పఠాన్ దెబ్బ తో పోస్ట్ పోన్ అవ్వాల్సి వచ్చింది. ఆ ఇంపాక్ట్ కూడా కొద్దిగా ఎఫెక్ట్ చూపించడం, సినిమా ట్రైలర్ అండ్ సాంగ్స్ కూడా….

ఒరిజినల్ తో పోల్చితే ఏమాత్రం ఇంప్రెస్ అయితే చేయలేదు అనే చెప్పాలి, క్వాలిటీ మాత్రం రిచ్ గా ఉండటం ఒక్కటే ప్లస్ పాయింట్. ఇక సినిమా ఈ శుక్రవారం రిలీజ్ అవుతూ ఉన్నా కానీ మినిమమ్ బజ్ అయితే లేదనే చెప్పాలి… సినిమా బుకింగ్స్ కూడా ఏమాత్రం…

ఇంప్రెసివ్ గా లేవని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తూ ఉండగా ఇండస్ట్రీ హిట్ రీమేక్ మూవీ ఓపెనింగ్స్ ఇప్పుడు నిరాశ కలిగించే విధంగా సొంతం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. తెలుగు లో వచ్చిన రేంజ్ లో టాక్ అక్కడ స్ప్రెడ్ అయితే లాంగ్ రన్ లో మంచి కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here