బాక్స్ ఆఫీస్ దగ్గర ఒకప్పుడు కామెడీ సినిమాలతో సూపర్ సక్సెస్ లను సొంతం చేసుకున్న అల్లరి నరేష్(Allari Naresh) నటించిన బచ్చల మల్లి(Bachhala Malli Movie) సినిమా సీరియస్ సబ్జెక్ట్ గా ఆడియన్స్ ముందుకు వచ్చినా మంచి మాస్ కంటెంట్ ఉండటం, అల్లరి నరేష్ పెర్ఫార్మెన్స్ కి మంచి రెస్పాన్స్ రావడంతో…
కలెక్షన్స్ పరంగా జోరు చూపెడుతుంది అనుకున్నా కూడా అలాంటిది ఏమి జరగలేదు. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఓపెనింగ్స్ నుండే పెద్దగా ఇంపాక్ట్ ఏమి చూపించకుండా నిరాశ పరిచే కలెక్షన్స్ నే సొంతం చేసుకుని అల్లరి నరేష్ కి మరో నిరాశ కలిగించే రిజల్ట్ సొంతం అయ్యేలా చేసింది.
సినిమా మొదటి వారంలో తెలుగు రాష్ట్రాల్లో 1.3 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 1.5 కోట్ల షేర్ ని అందుకోగా మిగిలిన రన్ లో మరో 25 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని పరుగును పూర్తి చేసుకుంది. దాంతో తెలుగు రాష్ట్రాల్లో సినిమా టోటల్ రన్ లో…
1.52 కోట్ల రేంజ్ లో షేర్ ని అటూ ఇటూగా సొంతం చేసుకోగా 3 కోట్లకు పైగా గ్రాస్ ను దక్కించుకుంది సినిమా…ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 1.75 కోట్ల రేంజ్ లో షేర్ ని దక్కించుకాగా 3.75 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని సొంతం చేసుకుని పరుగును కంప్లీట్ చేసుకుంది.
ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ హిట్ అనిపించుకోవాలి అంటే 5.50 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా 1.75 కోట్ల రేంజ్ లోనే రికవరీని సాధించిన సినిమా 3.75 కోట్ల రేంజ్ లో లాస్ ను సొంతం చేసుకుని రన్ ని కంప్లీట్ చేసుకుని డిసాస్టర్ గా నిలిచింది. దాంతో అల్లరి నరేష్ క్లీన్ హిట్ వేట కొనసాగుతుంది ఇప్పటికీ…