బాక్స్ ఆఫీస్ దగ్గర ఒకప్పుడు కామెడీ మూవీస్ తో మినిమమ్ గ్యారెంటీ హీరోగా మంచి మార్కెట్ ను సొంతం చేసుకున్న అల్లరి నరేష్(Allari Naresh) చాలా కాలంగా ఓ భారీ హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు, ఒకటి రెండు పర్వాలేదు అనిపించే సినిమాలు వచ్చినా కూడా భారీ హిట్స్ పడలేదు…ఒకప్పటి లా కామెడీ…
సినిమాలు ఇప్పుడు ఆడియన్స్ కి రొటీన్ అయిపోవడంతో సీరియస్ సబ్జెక్ట్ లను ఎంచుకుంటున్న అల్లరోడు ఇప్పుడు సీరియస్ అండ్ ఊరమాస్ సబ్జెక్ట్ తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు…బచ్చల మల్లి(Bachhala Malli Movie) అంటూ మాస్ టైటిల్ తో రూపొందిన ఈ సినిమా…
ఆడియన్స్ ముందుకు వచ్చే వారం రావడానికి సిద్ధమవుతూ ఉండగా లేటెస్ట్ గా సినిమా అఫీషియల్ ట్రైలర్ ను రిలీజ్ చేయగా ట్రైలర్ ఊరమాస్ గా ఉందని చెప్పాలి…అదే టైంలో హిట్ కళ కూడా కనిపిస్తుంది ట్రైలర్ లో….స్టోరీ పాయింట్ ను కూడా ట్రైలర్ లో రివీల్ చేశారు….
ఎవ్వరినీ పట్టించుకోకుండా మూర్కంగా బ్రతికే హీరో లైఫ్ లోకి హీరోయిన్ ఎంటర్ అయిన తర్వాత తన ప్రేమ కోసం తనని తాను పూర్తిగా మార్చుకునే హీరో లవ్ లైఫ్ లో ఫేస్ చేసిన పరిస్థితులతో మళ్ళీ తిరిగి ఎలా మారిపోయాడు అన్న కాన్సెప్ట్ తో రూపొందిన సినిమా లా…
అనిపించింది బచ్చల మల్లి సినిమా ట్రైలర్…రగ్గుడ్ మాస్ లుక్ లో అల్లరి నరేష్ ఓ రేంజ్ లో ఆకట్టుకోగా హీరోయిన్ అమృత అయ్యర్ కూడా ఆకట్టుకుంది…ట్రైలర్ లో మాస్ మూమెంట్స్, లవ్ సీన్స్ అండ్ ఎమోషన్స్ పర్వాలేదు అనిపించగా క్వాలిటీ కూడా బాగా మెప్పించింది…
సినిమా రిలీజ్ అయ్యాక ఆడియన్స్ ను మెప్పించే అవకాశం కనిపిస్తూ ఉండగా అన్నీ అనుకున్నట్లు జరిగితే ఎప్పటి నుండో అల్లరి నరేష్ ఎదురు చూస్తున్న బిగ్ మాస్ హిట్ ఈ సినిమా తో సొంతం అయ్యే అవకాశం ఉంది. మరి సినిమా ఎంతవరకు అంచనాలను అందుకుంటుందో చూడాలి….