Home న్యూస్ కన్నడలో బ్లాక్ బస్టర్….తెలుగు లో సినిమా ఎలా ఉందంటే!!

కన్నడలో బ్లాక్ బస్టర్….తెలుగు లో సినిమా ఎలా ఉందంటే!!

0

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప‌ సినిమాలో జాలిరెడ్డి పాత్రలో నటించి అందరినీ మెప్పించిన నటుడు ధ‌నుంజ‌య్. న‌టుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. క‌న్న‌డ‌లో 8 సినిమాల్లో హీరోగా చేసి, 9వ సినిమా శివ‌రాజ్ కుమార్ సినిమాలో విల‌న్‌గా చేశారు. ఆ చిత్రంలోని డాలీ పేరుతో డాలీ ధ‌నుంజ‌య్ గా పాపుల‌ర్ అయ్యారు. ఆయ‌న తాజాగా న‌టించిన సినిమా `బ‌డ‌వ రాస్కెల్‌`. శ్రీ‌మ‌తి గీతా శివ‌రాజ్‌కుమార్ స‌మ‌ర్ప‌కులుగా ఈ సినిమాకు వ్య‌వ‌హ‌ రించారు. శంక‌ర్ గురు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. డిసెంబ‌ర్‌ లో ఈ సినిమా క‌న్న‌డ‌లో విడుద‌లై విజ‌య‌ వంతంగా 50 రోజులు పూర్తిచేసుకుంది. ఇదే సినిమాను తెలుగులోనూ బ‌డ‌వ రాస్కెల్ గా అనువ‌దించారు.రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులను ఏమాత్రం ఎంటర్టైన్ చేసిందో రివ్యూ లో చుద్దాం పదండి.

స్టొరీ పాయింట్ విషయానికి వస్తే శంకర్ (ధనంజయ్) MBA పూర్తి చేసిన ఒక మధ్యతరగతి కుర్రాడు,  తన ఫ్రెండ్స్ (నాగభూషణ్)లతో సంతోషంగా జీవితాన్ని గడుపు తుంటాడు. తండ్రికి హెల్ప్ గా ఉండాలని తను కూడా ఆటో డ్రైవర్ గా చేస్తుంటాడు… అయితే శంకర్ ఒక పొలిటికల్ లీడర్ కుమార్తె సంగీత (అమృత అయ్యంగార్)తో ప్రేమలో పడతాడు. శంకర్ చేసే డ్రైవర్ పని మార్చుకోమంటుంది. అయితే శంకర్ అందుకు ఒప్పుకోకుండా తన సొంత కాళ్లపై నిలబడి ఎన్నో ఆటోలు కోనడానికి లోన్ అప్లై చేశానని అంటాడు.

ఇద్దరూ పెళ్లి చేసుకొని జీవితాన్ని కలిసి గడపాలని మీ అమ్మ నాన్నలతో. వచ్చి మన పెళ్లి విషయం మా అమ్మతో మాట్లాడమని చెపితే శంకర్ తన తల్లి తండ్రులతో వారి ఇంటికి వెళతాడు.అయితే అక్కడ జరిగిన సంఘటన ఇద్దరినీ దూరం చేస్తుంది, అది ఇద్దరి జీవితంలో మలుపు తిరుగుతుంది. ఆ తరువాత శంకర్ ను ఎవరో కిడ్నాప్ చేస్తారు.. ఇక్కడే కథ మొత్తం మలుపు తిరుగుతంది. ఎవరు ఎందుకు కిడ్నాప్ చేశారు ? ఆ తరువాత తన జీవితాన్ని ఎలా చక్కదిద్దుకున్నాడు..

తన స్నేహితుల సహాయంతో, తన ప్రేమను గెలిపించుకున్నాడా  లేదా తెలియాలంటే “బడవ రాస్కెల్ “సినిమా చూడాల్సిందే..నటీనటుల పనితీరు సాధారణమైన మద్య తరగతి యువకుడిగా శంకర్ (ధనంజయ్), చాలా చక్కగా నటించాడు..సంగీత (అమృత అయ్యంగర్ ), చాలా చక్కగా, చలాకీగా నటించింది. శంకర్ కు స్నేహితుడిగా నటించిన నాగభూషణ్ తన నటనతో అందరినీ నవ్వించే ప్రయత్నం చేశాడు.హీరో తల్లి, తండ్రులు గా రంగనాథ్ (రంగాయణ రఘు),తల్లి పాత్రలో (తార )లు చాలా చక్కగా నటించారు.ఇంకా ఇందులో స్పర్షరేఖ, పూర్ణచంద్ర మైసూరు తదితరులు తమకిచ్చిన పాత్రలలో చాలా చక్కగా నటించారు.

టెక్నికల్ డిపార్ట్ మెంట్ విషయానికి వస్తే
డైరెక్టర్ శంకర్ గురు మధ్యతరగతి విలువలను ప్రతిబింబించే ఓ సరికొత్త  ప్రేమ కథను ఎంపిక చేసుకుని కథ, కథనాలను చాలా చక్కగా తెరకెక్కిస్తూ. మధ్యతరగతి జీవితాలను లోతుగా గమనించి, అర్థం చేసుకున్న వాడిలా దర్శకుడు తన అనుభవాలను సినిమా ద్వారా చాలా చక్కగా తెరకెక్కించాడు., అలాగే ఇందులో వచ్చే డైలాగ్స్, కామెడీ  ప్రేక్షకులను ఆకట్టు కుంటాయి. ఫీల్ గుడ్ కామెడీ లవ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు వాసుకి వైభవ్ అందించిన సంగీతం ఆకట్టుకుంది. పాటలు, నేపథ్య సంగీతం సినిమాకు బలాన్నిచ్చాయి.

ఇందులో వచ్చే బడవా రాస్కెల్ సాంగ్ చిత్రీకరణ చాలా బాగుంది. ఈ సినిమాకు ప్రీతం జయరామన్ అందించిన సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ప్రతి ఫ్రెమ్ ని అందంగా చూపించారు.ఎడిటింగ్ పని తీరు బాగుంది. ఇందులో నటించిన పాత్రలు చాలా రియలిస్టిక్ గా ఉన్నాయి.లవ్, సెంటిమెంట్స్, యాక్షన్ మరియు కామెడీ వంటి అంశాలతో — కొన్ని పంచ్ డైలాగ్స్‌తో , శంకర్ కథలో ఉండి పాత్రలు మాట్లాడేలా చేసాడు. శ్రీ‌మ‌తి గీతా శివ‌రాజ్‌కుమార్ స‌మ‌ర్పణలో నిర్మించిన ఈ సినిమాను రిజ్వానా ఏంటర్ టైన్మెంట్స్  తెలుగు ప్రేక్షకుల అందించారు.

మొత్తం మీద తెలుగు లో చాలా లిమిటెడ్ గా రిలీజ్ ను సొంతం చేసుకున్న ఈ సినిమాను ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్స్ కి వెళ్ళే ఆడియన్స్ చాలా వరకు కూడా ఆకట్టుకునే అవకాశం ఉంది, డబ్బింగ్ కూడా బాగానే సెట్ అయింది కాబట్టి ఒకసారి ఈజీగా చూసేయోచ్చు….సినిమా కి మొత్తం మీద మా రేటింగ్ 2.75 స్టార్స్….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here