ఈ ఇయర్ ఉన్నంతలో భారీ సినిమాలు ఏమి లేక పోయినా కూడా పర్వాలేదు అనిపించేలా కలెక్షన్స్ ను సొంతం చేసుకుంటూ దూసుకు పోతున్న బాలీవుడ్ ఇండస్ట్రీ నుండి భారీ అంచనాల నడుమ రంజాన్ కానుకగా రిలీజ్ అయిన అక్షయ్ కుమార్(Akshay Kumar) టైగర్ ష్రాఫ్(Tiger Shroff) కాంబోలో…..
వచ్చిన బడే మియా చోటే మియా(Bade Miyan Chote Miyan Collections) సినిమా ఏమాత్రం అంచనాలను అయితే అందుకోలేక పోయింది, ఆల్ మోస్ట్ 350 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఏ దశలో కూడా అంచనాలను అందుకోలేక పోయింది ఈ సినిమా…వీకెండ్ లోనే చేతులు ఎత్తేసిన ఈ సినిమా….
వర్కింగ్ డేస్ లో వస్తున్న కలెక్షన్స్ చూసి సినిమా మేకర్స్ కి తీవ్రమైన నిరాశ కలిగిస్తూ షాకిచ్చింది…5వ రోజు 2.45 కోట్లు, 6వ రోజు 2.3 కోట్లు ఇలా చిల్లర కలెక్షన్స్ ని మొదటి వారంలోనే అందుకోవడం తీవ్రమైన నిరాశ కలిగించే విషయం అని చెప్పాలి ఇప్పుడు… మొత్తం మీద 6 రోజులు కంప్లీట్ అయ్యే టైంకి సినిమా…
ఇండియాలో 45.5 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని మాత్రమే అందుకోగా 55 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది ఈ సినిమా…ఇక ఓవర్సీస్ లో సినిమా 28 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా ఇప్పుడు 83 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను మాత్రమే అందుకుంది ఈ సినిమా…
అందులో వర్త్ వరల్డ్ వైడ్ షేర్ పట్టుమని 40 కోట్లు కూడా లేవు…అంటే 350 కోట్లకు పైగా బడ్జెట్ తో వచ్చిన బడే మియా చోటే మియా బడ్జెట్ పరంగా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ లాస్ మూవీగా ఈ సినిమా నిలిచే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉండటం తీవ్రంగా నిరాశ పరిచే విషయం అని చెప్పాలి. ఇక మిగిలిన రన్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.