Home న్యూస్ టీసర్ కూడా లేదు…అయినా నైజాం గడ్డ మీద కల్కి ప్రకంపనలు!!

టీసర్ కూడా లేదు…అయినా నైజాం గడ్డ మీద కల్కి ప్రకంపనలు!!

0

పాన్ ఇండియా సెన్సేషన్…రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) సలార్ (Salaar Movie) తో సంచలనం సృష్టించిన తర్వాత ఇప్పుడు ఆడియన్స్ ముందుకు త్వరలోనే కల్కి 2898AD( Kalki2898AD Movie) తో రచ్చ చేయడానికి సిద్ధం అవుతున్నాడు…..సినిమా అంతా పూర్తీ అవ్వగా మే 30 న రిలీజ్ అనుకుంటున్నారు కానీ ఎలక్షన్స్ వలన ఇప్పుడు సినిమాను….

జూన్ లేదా జులై లో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తూ ఉండగా సినిమా టీసర్ కూడా ఇంకా రిలీజ్ అవ్వాల్సి ఉండగా అలాంటివి ఏమి లేకుండా బిజినెస్ పరంగా కల్కి మూవీ అన్ని చోట్లా ప్రకంపనలు సృష్టిస్తూ దూసుకు పోతూ ఉండటం విశేషం అని చెప్పాలి. కాగా సైన్స్ ఫిక్షన్ నేపధ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి…

తెలుగు రాష్ట్రాల్లో ఊహకందని రేంజ్ లో బిజినెస్ ఆఫర్స్ సొంతం అవుతూ ఉన్నాయని తెలుస్తుంది. నైజాం గడ్డ మీద టాలీవుడ్ చరిత్ర లోనే వన్ ఆఫ్ ది హైయెస్ట్ అనిపించే రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ ఆఫర్స్ ఇప్పుడు కల్కి మూవీకి సొంతం అవుతూ ఉండటం విశేషం అని చెప్పాలి.

సినిమా మీద ఎక్స్ పెర్టేషన్స్ కూడా సాలిడ్ గానే ఉండటంతో ఏమాత్రం టాక్ బాగున్నా అన్ని చోట్లా రికార్డు కలెక్షన్స్ తో కల్కి మూవీ సంచలనం సృష్టించే అవకాశం ఎంతైనా ఉంటుంది. నైజాంలో సినిమా కి రిఫండబుల్ అమౌంట్ అగ్రిమెంట్ కింద ఆల్ మోస్ట్ 75 కోట్ల మమ్మోత్ రేటు ఆఫర్ వచ్చిందని సమాచారం…

రిఫండబుల్ అమౌంట్ అంటే సినిమా ఒకవేళ 75 కోట్ల మార్క్ ని అందుకోని పక్షంలో కొంత అమౌంట్ ని మేకర్స్ కొన్న బయర్స్ కి రిటర్న్ ఇవ్వాల్సి ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో మిగిలిన ఏరియాలలో సైతం బిజినెస్ ఇలానే జరుగుతూ ఉంది… బాక్స్ ఆఫీస్ దగ్గర కల్కి ఎప్పుడు రిలీజ్ అయినా కూడా ప్రకంపనలు సృష్టించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here