Home న్యూస్ 350 కోట్ల బడే మియా చోటే మియా టాక్ ఏంటి….హిట్టా-ఫట్టా!!

350 కోట్ల బడే మియా చోటే మియా టాక్ ఏంటి….హిట్టా-ఫట్టా!!

0

బాలీవుడ్ లో ఈ ఇయర్ వన్ ఆఫ్ ది హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాగా వచ్చిన సినిమా బడే మియా చోటే మియా(Bade Miyan Chote Miyan Telugu Review)…బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్(Akshay Kumar) ఇప్పుడు టైగర్ ష్రాఫ్(Tiger Shroff) కాంబోలో వచ్చిన ఈ సినిమా మీద హైప్ ను ఓ రేంజ్ లో పెంచారు…ఆల్ మోస్ట్ 350 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా రీసెంట్ టైంలో….

బెస్ట్ యాక్షన్ మూవీ అంటూ రిలీజ్ కి ముందు నుండే అంచనాలను పెంచారు. ఇక సినిమా ఇప్పుడు ఆడియన్స్ ముందుకు వచ్చిన తర్వాత అంచనాలను అందుకుందా లేదా అంటే మాత్రం సగంలోనే ఆగిపోయింది అని చెప్పాలి ఇప్పుడు…. ఇండియా మీద కోపంతో రివేంజ్ తీసుకోవాలని చూస్తున్న విలన్ పృద్వీరాజ్ ఇండియన్ సెక్యూరిటీకి సంభందించి ఒక కీలకమైన ప్యాకేజ్ ను దక్కించుకుంటాడు….

దాన్ని రికవరీ చేయడానికి ఇద్దరు హీరోలను అపాయింట్ చేస్తారు….ఆ తర్వాత ఏం జరిగింది అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే…ఆల్ రెడీ బాలీవుడ్ లో ఇది వరకు వచ్చిన యాక్షన్ మూవీస్ బ్యాంగ్ బ్యాంగ్, టైగర్ జిందా హై, పఠాన్ ఇలా చాలా సినిమాలనే గుర్తు చేసిన బడే మియా చోటే మియా కొన్ని యాక్షన్ సీన్స్ పరంగా….

ఆకట్టుకున్నా కూడా ఏమాత్రం కొత్తదనం లేని సినిమా ఉన్నంతలో ఫస్టాఫ్ వరకు కొన్ని చోట్ల కామెడీ, కొన్ని చోట్ల యాక్షన్ వర్కౌట్ అవ్వగా సెకెండ్ ఆఫ్ కథ మాత్రం ఎటు నుండి ఎటో పోతూ నీరసం తెప్పించింది…. రొటీన్ స్క్రీన్ ప్లే తో భారీ విజువల్స్ ను చూపించినా కూడా పెద్దగా ఆకట్టుకోలేక పోయింది బడే మియా చోటే మియా సినిమా….

ఇద్దరు హీరోలు తమ రోల్స్ వరకు బాగా చేయగా హీరోయిన్స్ ఓకే అనిపించారు, ఇక పృద్వీరాజ్ విలనిజం పర్వాలేదు అనిపించింది….మొత్తం మీద ఫస్టాఫ్ పర్వాలేదు అనిపించినా సెకెండ్ ఆఫ్ పెద్దగా అంచనాలను అందుకోలేక పోయింది…యాక్షన్ పార్ట్ వరకు పర్వాలేదు అనిపించినా కూడా ఓవరాల్ మూవీ గా మాత్రం…

బడే మియా చోటే మియా భారీ బడ్జెట్ తో, భారీ యాక్షన్ సీన్స్ తో అక్కడక్కడా కొన్ని సీన్స్ వర్కౌట్ అయినట్లు అనిపించినా కూడా ఓవరాల్ గా అసలు కథనే బలంగా లేక పోవడంతో ఏ దశలో కూడా అంచనాలను అందుకోలేక పోయింది… మరీ ఎక్స్ పెర్టేషన్స్ పెట్టుకుని వెళితే మట్టుకు నిరాశ ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. లో ఎక్స్ పెర్టేషన్స్ తో వెళితే కొంచం బోర్ కొట్టినా పర్వాలేదు అనిపించవచ్చు….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here